Thar | మహీంద్రా సంస్థకు చెందిన ‘థార్’ (Thar) వాహనానికి ఉన్న క్రేజే వేరు. మార్కెట్లో ఎన్ని ఖరీదైన, విలాసవంతమైన బడ్జెట్ కార్లు ఉన్నప్పటికీ ఎక్కువ మంది థార్కే మొగ్గుచూపుతున్నారు. ఆ కారులో రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నారు. ప్రమాదకర స్టంట్స్ చేస్తూ నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు.
థార్ ప్రమాదాలు, వివాదాలు ప్రస్తుతం సర్వసాధారణమైపోయాయి. ప్రజలు థార్ నడపడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారని స్వయానా హర్యాణా డీజీపీ (Haryana DGP) ఓపీ సింగ్ (OP Singh) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఓ థార్ వాహనం నదిలో చిక్కుకుపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. వీకెండ్లో కొందరు గ్రూప్‌గా థార్ వాహనాల్లో గురుగ్రామ్, ఫరీదాబాద్ పక్కనే ఉన్న ఆరావళికి క్రమం తప్పకుండా ఆఫ్ రోడింగ్‌కి (Off Roading Adventure) వెళ్తుంటారు.
రోడ్లపై కాకుండా ఇసుక దిబ్బలు, కంకర, బురద, రాళ్లపై కార్లను డ్రైవ్ చేస్తూ ఆఫ్రోడింగ్ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఆదివారం ఓ గ్రూప్ కూడా సాహసయాత్రకి బయల్దేరింది. వారు ఓ సరస్సు నుంచి కార్లను నడిపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ వాహనం నీటిలో చిక్కుకుపోయింది. అయితే, అదృష్టవశాత్తూ కారు లోపల ఉన్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. అనంతరం ఆ కారును మరో థార్ సాయంతో బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
FUCKING INDIAN CAR TALK TOO MUCH BASTARD @anandmahindra
On Camera, Mahindra Thar Drowns In Lake Near Delhi In Dangerous Stunt’Gang of Thars’, a group of SUV lovers were off-roading near Aravallis adjoining Gurugram and Faridabad when one of the Thars drowned in the lake.… pic.twitter.com/5BglcHPe3v— Mark Brewer (@theapril29th) November 10, 2025
థార్ వాహనాన్ని నడిపే వ్యక్తులను ఉద్దేశించి హర్యాణా డీజీపీ (Haryana DGP) ఓపీ సింగ్ (OP Singh) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మహీంద్రా ‘థార్’ ఎస్యూవీ డ్రైవర్లు రహదారులపై అతి వేగంగా నడుపుతూ, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ట్రాఫిక్ తనిఖీ విధానాలపై మీడియాతో మాట్లాడిన ఆయన థార్ వాహనాలను చూస్తే వదిలిపెట్టడం కష్టమని, వాటిని నడిపే వారు రోడ్డుపై విన్యాసాలు చేస్తుంటారని పేర్కొన్నారు. ఆ వాహనాలను స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారన్నారు. ‘ఇది కారు కాదు.. నేను ఇలాంటి వాడిని’ అని చెప్పే ప్రకటన లాంటిదని అభివర్ణించారు. థార్ వాహనాల్లో ప్రయాణికులు రూఫ్‌పై కూర్చోవడం, సైడ్బోర్డ్లపై నిలబడటం వంటి ప్రమాదకరమైన చర్యల కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
పోలీసు అధికారి కొడుకు థార్ నడుపుతూ ఒకరిని ఢీకొట్టిన ఘటనను గుర్తుచేస్తూ, బాధ్యతారాహిత్యంగా నడిపితే వాహనాలు దుర్వినియోగమవుతాయని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా డీజీపీ సరదాగా మాట్లాడుతూ థార్ కొనుగోలు చేసే పోలీసు అధికారులు కూడా ‘కొంచెం పిచ్చివారు’ అయి ఉంటారని వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు. ఇటీవల థార్ వాహనాలను ప్రమాదకరమైన స్టంట్లకు ఉపయోగించడం, అతివేగంతో నడపడం వంటివి పెరగడంతో రాష్ట్ర యంత్రాంగం వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది.
Also Read..
Siddaramaiah | సిద్ధరామయ్యకు షాకిచ్చిన అధిష్ఠానం.. సీఎం మార్పు ఊహాగానాల వేళ భేటీకి సమయం నిరాకరణ..!
“థార్ డ్రైవర్లు ప్రమాదకారులు!.. హర్యానా డీజీపీ సంచలన వ్యాఖ్యలు”
Tamil Actor | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం.. నటుడు అభినయ్ కింగర్ మృతి