Promotions | హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవోల) ప్రమోషన్ల వ్యవహారం పెను దుమారం రేపుతున్నది. నిబంధనలను తుంగలో తొకి, అర్హులను పకనపెట్టి, వివాదాస్పద వ్యక్తులను అం దలమెక్కించేందుకు తెరవెనుక భారీ కుట్ర జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమోషన్లకు కేసులే ప్రామాణికమన్న చందంగా సాగుతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పంచాయతీరాజ్ శాఖలో 55 మంది ఎంపీడీవోలు, 27 మంది డిప్యుటీ సీఈవోల ఉద్యోగోన్నతుల జా బితా సిద్ధమైంది. ఈ జాబితా రూపకల్పనతో భారీగా ఉల్లంఘనలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో ఓ ఉద్యోగ సంఘం నేత ఉద్యోగులంతా కాంగ్రెస్‌కు అండగా ఉన్నట్టు బహిరంగంగా ప్రకటించారు. దీన్ని ఎన్నికల కోడ్ అతిక్రమణగా పరిగణించి ఆయనను సస్పెండ్ చేయాలి. కానీ, అదే జిల్లాకు చెందిన మంత్రి కలెక్టర్‌పై ఒత్తిడికి తీసుకొచ్చి సస్పెండ్ చేయకుండా అడ్డుపడ్డారట. ఇప్పుడు తాజాగా అదే ఉద్యోగ సంఘం నేతలకు ప్రమోషన్లు ఇవ్వబోతున్నారట.ఎన్నికల్లో సహకరించినందుకే ఈ పదోన్నతులా? అని ఇతర ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసినందుకు పదోన్నతులు కట్టబెట్టడం వింతేనని కొందరు అంటున్నారు.
ఏండ్ల్ల తరబడి నిషళంకంగా సేవలందిస్తూ, సీనియారిటీ కలిగి ఉన్న తమ పేర్లు మాత్రం ప్రమోషన్ల జాబితాలో కనిపించడం లేదని పలువురు ఎంపీడీవోల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2007 మార్చిలో గ్రూప్-1 ద్వారా ఎంపికై సిన్సియర్‌గా పనిచేస్తున్న తమకు ఉద్యోగోన్నతులు కల్పించడం లేదని, ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉండే ఉద్యోగ సంఘాల నేతలకు ఎన్నికల కేసులు ఉన్నా పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు కల్పిస్తున్నారని, వారి కారణంగా తమకు అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు. సర్వీస్ రూల్స్, రోస్టర్ పాయింట్లను పకన పెట్టి, కేవలం పైరవీలు, ‘ముడుపుల’ ఆధారంగానే పేర్లను ఖరారు చేశారని నిప్పులు చెరుగుతున్నారు.
ఉద్యోగోన్నతులకు సంబంధించి ఇంకా అధికారికంగా జీవో విడుదల కాకముందే అక్రమ మార్గంలో ప్రమోషన్ల జాబితాలో చోటు సంపాదించిన కొందరు సంబురాల్లో మునిగిపోయా రు. ఆ జాబితాలో పేరున్న ఉద్యోగ సంఘాల కీలక నేతను శుక్రవారం కొందరు మహిళా ఉ ద్యోగులు పూలమాలలతో ఘనంగా సన్మానించి, కేక్ కటింగ్‌లు, జల్సాలు చేసుకున్నారు. ప్రమోషన్ల జాబితా రూపకల్పనలో ఎంత ‘గోల్ మాల్’ ఈ హం గామాతో అర్థం చేసుకోవచ్చని తోటి ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. వివాదాస్పద అధికారులతో కూడిన ఈ జాబితాను ఒకట్రెండు రోజుల్లోనే విడుదల చేసేందుకు శాఖాధిపతులు సిద్ధమైనట్టు సమాచారం.
సాధారణంగా ప్రభుత్వం ఉద్యోగోన్నతులు కల్పించే సమయంలో శాఖాపరంగా ఎలాంటి పెండింగ్ కేసులు లేనివారినే సీనియారిటీ జాబితాలో చేరుస్తారు. కానీ, తాజాగా పంచాయతీరాజ్ శాఖలో ఎంపీడీవోలకు ప్రమోషన్లు కల్పించేందుకు రూపొందించిన సీనియారిటీ జాబితాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి ఆరోపణలతో శాఖాపరమైన కేసులు ఎదురొంటున్న, క్రమశిక్షణా చర్యలు పెండింగ్‌లో ఉన్న సుమారు 10 మంది అధికారుల పేర్లు ప్రమోషన్ల జాబితాలో ఉండటం అర్హులైన అధికారులకు మింగుడుపడటం లేదు. ముఖ్యంగా 18 కేసులున్న ఓ కీలక ఉద్యోగ సంఘం నేతకు పదోన్నతి దాదాపు ఖరారైనట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన ఆ నేత తన పలుకుబడిని ఉపయోగించి చాలా కేసులను పరిష్కరించుకున్నట్టు సమాచారం. ఇదేవిధంగా మరో నాయకుడిపై 10కిపైగా, మరికొందరిపై రెండు నుంచి ఐదు కేసులు ఉన్నాయి. వాటిలో కొన్ని కేసులపై విచారణ ఇంకా కొనసాగుతున్నది. మరికొందరు అధికారులపై క్రమశిక్షణా చర్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగుల సర్వీస్ నిబంధనల ప్రకారం.. కేసులు విచారణలో ఉన్నవారికి ప్రమోషన్లు నిలిపివేయాలి. కానీ, ఇకడ మాత్రం వ్యవహారం రివర్స్‌గేర్‌లో నడుస్తున్నది. అనర్హులను అందలమెక్కించేందుకు పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 27 మంది డిప్యుటీ సీఈవోలకు సీఈవోలుగా, 55 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆ శాఖ మంత్రి సీతక్కకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ప్రజాభవన్‌లో సీతకను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 28 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, 15 మంది డిప్యూటీ సీఈవోలకు సీఈవోలుగా ఉద్యోగోన్నతులు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అటెండర్ల నుంచి ఎంపీడీవోల స్థాయి ఉద్యోగులకు దశలవారీగా ప్రమోషన్లు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీజీవో అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్‌రావు, సీఈవో, డిప్యు టీ సీఈవో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కొంపల్లి నర్సింహులు, ఎంపీడీవో అసోసియేషన్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.