చుంచుపల్లి, నవంబర్ 11 : చుంచుపల్లి మండల 1వ అధ్యక్షుడిగా ముత్యాల రాజేశ్, చుంచుపల్లి మండల 2వ అధ్యక్షుడిగా గూడెల్లి యాకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రేగ కాంతారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బూతు స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నిర్మాణంలో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీ చేపట్టినట్లు తెలిపారు. ఆయా మండలాల్లో పార్టీకి నిబద్దతతో పనిచేసే వారిని పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం మేరకు ఈ రోజు కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలంలో మండల అధ్యక్షుల నియామకం ఏకగ్రీవంగా ఎంపిక చేసి ప్రకటించినట్లు వెల్లడించారు.

Chunchupalli : చుంచుపల్లి బీఆర్ఎస్ మండలాధ్యక్షులుగా ముత్యాల రాజేశ్, గూడెల్లి యాకయ్య