EX VOA Saritha | మల్లాపూర్, నవంబర్ 11 : గతంలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందనే ప్రధాన కారణంతో నాపై వ్యక్తిగతంగా కక్ష్య గట్టి ఐకేపీలో పనిచేస్తున్న నా వీఓఏ ఉద్యోగం నుండి అధికార బలాన్ని ఉపయోగించి నన్ను అకారణంగా తొలగించారని, గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ చెప్పినట్టు వింటేనే నాకు ఉద్యోగం మళ్లీ ఇప్పిస్తానని అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు జగిత్యాల జిల్లా రేగుంట గ్రామానికి చెందిన మాజీ వీఓఏ సరిత ఆరోపించారు.
మంగళవారం మాజీ వీఓఏ సరిత తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని ప్రధాన కూడలి గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి తన నిరసనను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సదరు నేత గ్రామంలో వేరే వాళ్లకు తన వీఓఏ పదవి ఇప్పించడానికి మహిళ సంఘాల సభ్యులను ఇష్టం లేకపోయినప్పటికి భయబ్రాంతులకు గురి చేసి సంతకాలు సేకరించినట్లు తెలిపారు. తనకు గ్రామంలోని మహిళ సంఘాల సభ్యులు సంపూర్ణంగా మద్దతుగా ఉన్నారని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి తన వీఏఓ ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించాలని కోరారు.
అలాగే మాజీ ఎంపీటీసీతో తనకు ప్రాణభయం ఉందని, తనను తరచూ అన్ని రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నాడని వివరిస్తూ పోలీస్ స్టేషన్లో ఇటీవల ఫిర్యాదు చేయగా, దీనిపై ఉన్నతాధికారులు స్పందించి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం కాస్తా మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Dharmasagar | యూనియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : బ్యాంక్ మేనేజర్ అనిల్
Madhira : లడకబజార్లో ఉచిత వైద్య శిబిరం