Jubilee Hills By Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇక మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. క్యూలైన్లలో నిల్చున్న వారందరికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ సమయం ముగిసేందుకు మరో రెండు గంటల సమయం ఉంది. ఈ రెండు గంటల సమయంలో మరో 10 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94 శాతం పోలింగ్ నమోదైంది.