Vijay Devarakonda | ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ సిట్ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసులో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్స్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విజయ్ సహా పలువురు ప్రముఖులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా సిట్ అధికారులు విచారించారు. బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్ల విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. దాదాపు గంటకుపైగా విజయ్ సీడీఐ కార్యాలయంలో ఉన్నాడు.
విచారణ పూర్తయిన తర్వాత సీఐడీ కార్యాలయం వెనుక గేట్ నుంచి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండతో పాటు నటుడు ప్రకాశ్‌రాజ్‌కు ఇటీవ అధికారులు నోటీసులు ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పలువురు ప్రముఖులను పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ సైతం కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో కొందరు నటీనటులను ప్రశ్నించింది. మరో వైపు ఇటీవల ఈడీ మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌కు సంబంధించిన రూ.11కోట్లకుపైగా ఆస్తులను జప్తు చేసిన విషయం తెలిసిందే.