Farmer ID | నిజాంపేట, జూలై 5 : దేశంలో ఆధార్ ఐడీ ఉన్నట్లుగా రాష్రంలో భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ ఐడీని పొందాలని ఏఈవో వంశీకృష్ణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆధార్‌తో దేశంలోని ప్రతి పౌరునికి ఎలా గుర్తింపు కార్డు ఉందో అదే విధంగా భూమి కలిగిన ప్రతీ రైతుకు ఫార్మర్ ఐడి ఉండాలన్నారు. ఈ ఐడీ పదకొండు అంకెలతో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వివరించారు.
వ్యవసాయ రంగానికి పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. భూమి ఉన్న ప్రతీ రైతు తమ భూములకు సంబంధించిన వివరాలతో ఉన్న సమాచారంతో ఈ ఫార్మాట్‌ను రిజిస్టర్ ఏర్పాటు చేశారన్నరు. రెవేన్యు శాఖద్వార సేకరించిన ఈ భూమి మజమాన్య వివరాలను రైతు యెక్క ఆదార్ సంఖ్యతో అనుసంధానం చేయడం ద్వారా ఈ ఫార్మర్ ఐడీని కేటాయించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ ఫార్మర్ రిజిస్టర్ ఏ రకమైన చట్టబద్ద యజమాన్యహక్కులను కల్పించదు. కేవలం రెవెన్యూ శాఖ వద్దున్న భూముల వివరాల ఆధారంగా ప్రామాణికంగా తీసుకొని ఈ రైతు ఫార్మర్ ఐడి కేటాయించడం జరుగుతుందని అన్నారు. పీఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్దిదారులకు ప్రమాణికంగా ఫార్మర్ రిజిస్ష్రేషన్లో నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారి చేసిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ పతకం ఫార్మర్ రిజిస్టర్కి ఎలాంటి సంబంధం లేదన్నారు. రైతు విశిష్ట సంఖ్యను ఫార్మార్ ఐడి పొందుటకు రైతు ఆధార్ ,మొబైల్ నంబర్‌కు అనుసంధానం కలిగి ఉండాలన్నారు. మొబైల్‌కు ఓటీపీ వస్తుందని అన్నారు. భూమికి సంబంధించిన పత్రాలతో మండల కేంద్రమైన నిజాంపేట్‌లోని రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి, క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి భూమి కలిగిన ప్రతి ఒక్క రైతు ఫార్మర్ ఐడీ పొందాలన్నారు.
రైతులకు తప్పని తిప్పలు.. మళ్లీ యూరియా కోసం కష్టాలు
RTC Special Bus | అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్నగర్ నుంచి ప్రత్యేక బస్సులు
Leopard | వడ్డేపల్లిలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు