చండూరు, సెప్టెంబర్ 06 : జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి (National Family Benefit Scheme – NFBS) అర్హులు దరఖాస్తు చేసుకునేలా చూడాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. శనివారం చండూరు తాసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. 59 సంవత్సరాల లోపు ఉన్న కుటుంబ పెద్ద ఏదైనా కారణం చేత మరణిస్తే అర్హులైన కుటుంబానికి ఈ పథకం కింద రూ.20 వేలు అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హులు దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. అనంతరం కేజీబీవీని కలెక్టర్ తనిఖీ చేశారు. కేజీబీవీ పరిసరాలు, కిచెన్, స్టోర్ రూమ్, వాష్ ఏరియాను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ మల్లేశ్, ఎంపీడీఓ యాదగిరి పాల్గొన్నారు.