కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా రైతాంగానికి యూరియా( Urea ) ను అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar ) ఆరోపించారు. మంత్రులు శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu), పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar) , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ( Laxman Kumar ) స్టార్ హోటల్లోనే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు.
రైతులు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తు , సహనం నశించి ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మలను ఒప్పించి ఉమ్మడిజిల్లాకు సరిపోయే రీతిలో యూరియాను తెప్పించడంలో జిల్లా మంత్రులు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. మంత్రులు జిల్లాను వదిలి హైదరాబాద్ హోటల్లో సమావేశాలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు.
యూరియాను అడిగితే కేంద్రం ప్రభుత్వం ఇవ్వడం లేదని మంత్రులు విఫల సమాధానం చెబుతున్నారని వెల్లడించారు. నెల రోజులుగా రైతులు సాగు పనులు వదిలి, కోడికూయక ముందే సహకార సంఘాల వద్దకు చేరుకొని క్యూ కడుతున్నారు. అయినా దొరకక తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు.
సమైక్య రాష్ట్రంలో మాదిరిగానే చెప్పులను లైన్లో పెట్టి గంటల తరబడి నిరీక్షిస్తున్నారని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా కొరతకు పరిష్కరించాలన్న సోయి పాలకులకు లేకుండా పోయిందని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో యూరియా కొరతను తీర్చడానికి మంత్రులు చర్యలు తీసుకోవాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.