Jana Nayagan | విజయ్ టీంకు బిగ్ షాక్.. జననాయగన్ భారీ ఓటీటీ డీల్ రద్దు..!
Jana Nayagan | జన నాయగన్ ముందుగా నిర్ణయించిన ప్రకారం జనవరి 9నే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ బోర్డ్ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో నిలిచిపోయింది.
Jana Nayagan | కోలీవుడ్ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ (Thalapathy Vijay) టైటిల్ రోల్ పోషిస్తోన్న మూవీ జన నాయగన్ (Jana Nayagan). కార్తీ (ఖాకీ) ఫేం హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగులో ప్రజల నాయకుడు టైటిల్‌తో రిలీజ్ కానుంది. జన నాయగన్ ముందుగా నిర్ణయించిన ప్రకారం జనవరి 9నే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ బోర్డ్ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో నిలిచిపోయింది.
పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియో జననాయగన్ ఓటీటీ డీల్‌ను రద్దు చేసుకుందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2026 పొంగళ్ కానుకగా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ వివాదంతో వాయిదా పడ్డ విషయం తెలిసిందే. తాజా టాక్ ప్రకారం అమెజాన్ ప్రైం వీడియో జననాయగన్ పోస్ట్ థ్రియాట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను రూ.120 కోట్లకు దక్కించుకోగా.. ఇప్పుడు మాత్రం ఆ డీల్‌ను రద్దు చేసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జననాయగన్ రిలీజ్‌పై క్లారిటీ లేకుండా పోయింది.
సినిమాలో కొన్ని సన్నివేశాలు మతపరమైన బావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. ఆర్మీ దళాలను సమస్యాత్మక కోణంలో చూపించారని సీబీఎఫ్సీ సెన్సార్ సర్టిఫికెట్‌ను జారీ చేయలేదు. ప్రస్తుతం ఈ మూవీ రివైజింగ్ కమిటీ ముందు ఉంది. రాబోయే రోజుల్లో రివైజింగ్ కమిటీ సినిమా చూడనుందని తెలుస్తోంది. ఆ తర్వాత సెన్సార్‌పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్టు ఇన్సైడ్ టాక్. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి లైన్లో ఉండబోతున్న ఈ చిత్రానికి హెచ్ వినోథ్ దర్శకత్వం వహించాడు. పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మమితా బైజు కీ రోల్ చేస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో చివరి సినిమాగా వస్తోంది జననాయగన్.
Read Also :
Dhurandhar | సీక్వెల్ రిలీజ్ ముందు సంచలనం.. 500 స్క్రీన్లలో రీ-రిలీజ్‌కి సిద్ధమైన దురంధర్ చిత్రం
Anurag Kashyap | ఎప్స్టీన్ ఫైల్స్‌తో నాకు సంబంధం లేదు: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్
Yami Gautam | ఆదిత్య ధర్ బర్త్‌డే.. భర్తపై ఎమోషనల్ పోస్ట్ పెట్టిన యామీ గౌతమ్!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

