అమరావతి : ఏపీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత చంద్రబాబు( Chandra Babu ) తనపై ఉన్న కేసులను ( Cases ) కొట్టేయించుకుంటున్నారని జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ ( Jada Shravan Kumar ) వెల్లడించారు. గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు కేసులపై తాను పోరాటం చేస్తున్నానని, అతడిపై ఉన్న ప్రతీ కేసునూ రీ ఓపెన్ చేయించి తీరుతానని స్పష్టం చేశారు. కేసులను రీ ఓపెన్ ( Re open ) చేయించలేకపోతే న్యాయవాద వృత్తిని వదిలేస్తానని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ఇష్టమొచ్చిన రీతిలో అమ్మేస్తున్నారని, ఇది అన్యాయమని ప్రశ్నించినందుకు తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు తనపై ఉన్న నాలుగు కేసుల్లోనే విచారణ ఎదుర్కోవాల్సిందేనని పేర్కొన్నారు. 2029లో నైనా ప్రతీ కేసును రీ ఓపెన్ చేయిస్తానని శపథం చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్‌కల్యాణ్ అతిపెద్ద భాగస్వామి అని వివరించారు. మహిళలపై వేధింపులకు పాల్పడిన కూటమి నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.