రామగిరి, సెప్టెంబర్ 06 : ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్లో రాష్ట్ర స్థాయి పోటీలకు నల్లగొండ జిల్లా సైన్స్ అధికారి, సీనియర్ బయోసైన్స్ టీచర్ వనం లక్ష్మీపతి ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో ఆయన ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికవడంపై డీఈఓ బొల్లారం భిక్షపతి, జిల్లా సైన్స్ టీచర్స్ ఫోరం, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఈ నెల 9, 10వ తేదీల్లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే పోటీల్లో లక్ష్మీపతి పాల్గొననున్నారు.