పెన్పహాడ్, సెప్టెంబర్ 06 : పెన్పహాడ్ మండల పరిధిలోని నారాయణగూడెం పీఏసీఎస్ పరిధిలోని అనంతారం గ్రామంలోని సహకార సంఘం కార్యాలయం వద్ద క్యూలైన్లో పట్టా పాస్ బుక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టి గంటల తరబడి నిలబడినా బస్తా యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. సింగిల్ విండో కార్యాలయానికి 566 బస్తాల యూరియా రాగా 15 వందల మంది రైతులు ఉన్నారు. ఒక్క రోజు ముందే జిరాక్స్ లను లైన్లో పెట్టిన వారు వెయ్య మంది రైతులు ఉన్నారు. దీంతో యూరియా పంపిణీ కోసం పోలీస్ బందోబస్తు నడుమ యూరియా పంపిణీ చేశారు. ఒక బస్తా యూరియా ఇస్తే పంటలను కాపాడుకునేది ఎట్లా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.
Penpahad : అనంతారంలో బస్తా యూరియా కోసం రైతుల తిప్పలు