పెన్‌పహాడ్, సెప్టెంబర్ 19 : పెన్‌పహాడ్ మండలం అనాజీపురం మోడల్ పాఠశాలలో శుక్రవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్, ఈవీఎంపై ఓటింగ్ విధానం, కౌంటింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించి మాక్ పోలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగించారు. మొత్తం ప్రక్రియను నిజమైన ఎన్నికల ప్రక్రియ లాగే చేపట్టారు. పదవికి పాఠశాల నుంచి 4 మంది విద్యార్థులు నామినేషన్ వేసి పోటీలో ఉండగా, కాలేజీ నుంచి ఆరుగురు పోటీల్లో ఉన్నారు. 10 మంది విద్యార్థులకు గుర్తులు కేటాయించి, పోలింగ్ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులంతా ఓటింగ్‌లో పాల్గొన్నారు.
స్కూల్ స్థాయి :
హెడ్ బాయ్ – ఎం.హరి ప్రసాద్ రావు
హెడ్ గర్ల్ – బి.శివ పార్వతి
కాలేజీ స్థాయి :
హెడ్ బాయ్ – ఎం.సతీశ్
హెడ్ గర్ల్ – టి.నిహారిక
మాక్ పోలింగ్ ప్రక్రియను మండల తాసీల్దార్ డి.లాలు నాయక్, ఎస్ఐ గోపి కృష్ణ ప్రత్యేకంగా హాజరై విద్యార్థుల ఉత్సాహాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కోడి లింగయ్య, గురు చరణ్, జి.సోమయ్య, సంపత్ కుమార్, సూర్య గౌడ్ పాల్గొన్నారు.
Penpahad : విద్యార్థుల్లో ఎన్నికల జోష్