అచ్చంపేట రూరల్ : ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్ కమీషనరేట్ ముట్టడికి బయలు దేరిన టీఎస్‌యూటీఎఫ్ ఉపాధ్యాయులను అచ్చంపేట పోలీసులు(Police arrest) అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు కొర్ర శంకర్ మాట్లాడుతూ పండిట్, పీఈటీ పోస్టులు అప్ గ్రేడేషన్, హెచ్ఎం పోస్టులు మంజూరు, సీఆర్టీలకు మినిమం బేసిక్ పే, తదితర 21 డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అరెస్టులతో పోరాటాలను, ఉద్యమాలను ఆపలేరని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాములు, బాబురావు, మోతిలాల్, లక్ష్మణ్, లక్మణ్ సిoఘ్ తదితరులు పాల్గొన్నారు.