దేవరకొండ రూరల్, సెప్టెంబర్ 19 : పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా చేపట్టాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పిలుపునిచ్చారు. “స్వచ్ఛతా హీ సేవ 2025” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామంలో చేపట్టిన స్వచ్ఛ పక్షోత్సవ్ కార్యక్రమంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామంలోని రహదారులు, ప్రజా స్థలాలు శుభ్రపరచి, ప్లకార్డులు పంపిణీ చేసి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా పరిశుభ్రతా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. అనంతరం మైనంపల్లి మాజీ ఎంపీటీసీ కొర్ర గౌతమి రాంసింగ్ ఆర్థిక సహకారంతో క్రీడాకారులకు పంపిణీ చేసిన కోట మైసమ్మ క్రికెట్ టీమ్ జెర్సీని ఆవిష్కరించారు.
Devarakonda Rural : పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే బాలు నాయక్