IND A vs AUS A : సొంతగడ్డపై భారత కుర్రాళ్లు సెంచరీలతో రెచ్చిపోయారు. ఆస్ట్రేలియా ఏ బౌలర్లను ఉతికారేసిన దేవ్‌దత్ పడిక్కల్(150), వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(140) సెంచరీలతో కదం తొక్కారు. దాంతో, భారీ స్కోర్ చేసిన శ్రేయస్ అయ్యర్ సేన ప్రత్యర్థి గెలుపు ఆశలపై నీళ్లు చల్లింది. తొలి ఇన్నింగ్స్‌ను 531/7 వద్ద డిక్లేర్ చేసింది భారత్. అనంతరం ఆసీస్ వికెట్ల కోల్పోకుండా 52 పరుగులు చేసింది. దాంతో.. తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసింది.
ఏక్నా క్రికెట్ స్టేడియంలో భారత ఏ జట్టు దీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసి మ్యాచ్ గెలవాలనుకున్న ఆస్ట్రేలియాకు చెక్ పెట్టింది. తొలుత ఆసీస్ ఓపెనర్లు సామ్ కొన్‌స్టాస్ (109), క్యాంప్‌బెల్ కెల్లవే(88) జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. కీలక భాగస్వామ్యం నిర్మించిన ఈ ద్వయాన్ని హర్ష్ దూబే (3-141) ఔట్ చేసి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆఖర్లో ఫిలిప్పే (124) శతకంతో మెరవగా ఆసీస్ తమ ఇన్నింగ్స్‌ను 532/6 వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ దీటుగా బదులిచ్చింది.
Devdutt Padikkal and Dhruv Jurel impressed with centuries for India A as their first four-day match against Australia A in Lucknow finished as a draw
Scorecard: https://t.co/G4kCMF6gps pic.twitter.com/fxJBKwzvae
— ESPNcricinfo (@ESPNcricinfo) September 19, 2025
ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (44), జగదీశన్ (64) హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో శుభారంభం ఇచ్చారు. సాయి సుదర్శన్(73) సైతం రాణించగా ఆసీస్ బౌలర్లకు దిక్కుతోచలేదు. ఈ ముగ్గురు ఔటయ్యాక.. దేవ్‌దత్ పడిక్కల్(150) క్రీజులో పాతుకుపోయాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(8) త్వరగానే ఔటైనా.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(140)తో కలిసి కంగారూ యువ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో జురెల్ సైతం బ్యాట్ ఝులిపించి సెంచరీ సాధించాడు. వీరిద్దరి మెరుపులతో భారత ఏ 531/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్ వికెట్ కోల్పోకుండా 56 పరుగులు చేసింది. ఇరుజట్ల మధ్య సెప్టెంబర్ 23 నుంచి రెండో అనధికారిక టెస్టు మొదలవ్వనుంది.