Singareni Profits | గోదావరిఖని : సింగరేణి సంస్థ 2024- 25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల నుంచి 34% వాటాగా పర్మినెంట్ కార్మికులకు అధికారులకు రూ.802.4 కోట్ల రూపాయలు చెల్లిస్తుంది. చెల్లింపులకు సంబంధించి యజమాన్యం విధివిధానాలను ఖరారు చేసింది.
అండర్ గ్రౌండ్లో పనిచేసే కార్మికులకు ఒక మస్టర్‌కు రూ.805.37 చెల్లించాలని.. భూ ఉపరితల ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో పని చేసే కార్మికులకు, సీఎస్పీలో పనిచేసే కార్మికులకు, సింగరేణి సంస్థ జైపూర్ విద్యుత్ కేంద్రంలో పనిచేసే కార్మికులకు మస్టర్‌కు రూ.637.58 చెల్లించాలని ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేసే పనిచేసే వారికి మస్టఱ్కు రూ.588.53 చెల్లించాలని యజమాన్యం నిర్ణయించింది.
దీనికి తోడుగా వ్యక్తిగత పనితీరు ఇన్సెంటివ్‌పై, గ్రూపు పనితీరుపై చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. ఇన్సెంటివ్‌పై కార్మికులకు రూ.5.61 కోట్ల రూపాయలను, గ్రూపు పనితీరుపై రూ.112.34 కోట్ల రూపాయలను చెల్లించాలని నిర్ణయించారు. మస్టర్ ప్రతిపాదికపై కార్మికులకు మొత్తం రూ. 684.44 కోట్ల రూపాయలను చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు యజమాన్యం పేర్కొంది.
ఇదిలా ఉంటే సింగరేణి సంస్థలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న వారికి ₹5500 లు చెల్లించనున్నారు. ఈ మొత్తం ₹ 16.5 కోట్లుగా అంచనా వేస్తున్నారు. శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో సోమవారం కార్మికులకు వారి ఖాతాల్లో లాభాల వాటా జమ కానుంది.
Karepally : ‘వ్యవసాయానికి సబ్సిడీల తగ్గింపులో భాగమే యూరియా కొరత’
Kothagudem Urban : లంబాడీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలి : గుగులోతు రాజేశ్ నాయక్
ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లంపేట టౌన్‌ప్లానింగ్ అధికారి రాధాకృష్ణా రెడ్డి