DSC 2008 | హైదరాబాద్ : ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాలు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ నెరవేర్చడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఎక్కడికక్కడ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రజా భవన్లో 2008 డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు.
ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులు మాట్లాడుతూ.. 2008 డీఎస్సీ అభ్యర్థుల కోసం జీవో నెంబర్ 9 తెచ్చి క్యాబినెట్ అప్రూవల్ చేసి కూడా సంవత్సరం గడిచింది.. అయినా తమకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండోసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి కూడా 100 రోజులు కావొస్తుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్స్ తీసుకోని 4 నెలలు అవుతుంది.. ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ లేనందున బయట ఉద్యోగాలు కూడా చేసుకోలేకపోతున్నామని, ఇంట్లో వాళ్లపై ఆధారపడలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా భవన్లో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
2008 డీఎస్సీ అభ్యర్థుల కోసం జీవో నెంబర్ 9 తెచ్చి క్యాబినెట్ అప్రూవల్ చేసి కూడా సంవత్సరం గడిచింది.. అయినా తమకు ఉద్యోగాలు ఇవ్వలేదు
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్స్ తీసుకోని 4 నెలలు అవుతుంది.. ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ లేనందున బయట… pic.twitter.com/CExUMQF7cK
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2025
ఇవి కూడా చదవండి..
Savitribai Phule | ఫూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలి : ఎమ్మెల్సీ మధుసూదనాచారి
RS Praveen Kumar | ఇలా చేస్తే పోలీసుల ఆత్మహత్యలను ఆపవచ్చు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక సందేశం
HMPV | చైనాలో మరో మహమ్మారి.. హెచ్ఎంపీవీ లక్షణాలు, నివారణ చర్యలు ఇవే..!