CULT Movie | ‘కల్ట్’తో విశ్వక్ కొత్త ప్రయోగం.. ఒకే సినిమాతో 40 మంది నటుల ఎంట్రీ!
Vishwak Sen | మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి మెగా ఫోన్ పట్టాడు. విశ్వక్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 'కల్ట్'
CULT Movie | మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి మెగా ఫోన్ పట్టాడు. విశ్వక్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘కల్ట్’ (CULT). ‘ఫలక్నుమా దాస్’, ‘దాస్ కా దమ్కీ’ వంటి సినిమాల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా, సాహసోపేతమైన కథాంశంతో ఉండబోతుందని తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమా ద్వారా ఏకంగా 40 మంది కొత్త నటీనటులను వెండితెరకు పరిచయం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో గాయత్రి భరద్వాజ్ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం.
వియత్నాంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా, నేటి కాలపు యువతను ఆకట్టుకునేలా ఒక కొత్త తరహా కథను విశ్వక్ సేన్ స్వయంగా రాసి తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు మరియు ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ను ఫిబ్రవరి 21న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ సంభాషణలు రాస్తుండటం విశేషం. సందీప్ కాకర్ల మరియు కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, జపనీస్ మరియు స్పానిష్ వంటి అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
⚠️ WARNING: EXTREME VIOLENCE AHEAD🩸#CultTeaser out on 21 February, 2026 ❤️🔥
Launch Event at Prasad’s PCX Screen from 3PM onwards 💥#CULT – INDIA’s FIRST SLASHER 🔥
Story, Screenplay & Direction Myself
Producer #SandeepKakarala #TarakCinemas @RaviBasrur #TharunBhascker… pic.twitter.com/1KtrekcStb— VishwakSen (@VishwakSenActor) February 19, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

