HMPV | చైనాలో మరో మహమ్మారి.. హెచ్ఎంపీవీ లక్షణాలు, నివారణ చర్యలు ఇవే..!
HMPV | చైనాలో ఇప్పుడు మరో వైరస్ వ్యాప్తి కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం అక్కడ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV Outbreak In China) తీవ్రంగా వ్యాప్తి చెందిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త వైరస్ లక్షణాలు, ఎలా వ్యాపిస్తుంది, నివారణ చర్యలు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
HMPV | ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో ఇప్పుడు మరో వైరస్ వ్యాప్తి కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం అక్కడ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV Outbreak In China) తీవ్రంగా వ్యాప్తి చెందిందని, కొవిడ్ వెలుగులోకి వచ్చిన సరిగ్గా ఐదేండ్ల తర్వాత మరో ప్రమాదకర వైరస్ వ్యాప్తి చెందుతున్నదని స్థానిక, సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్ బారినపడి అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం.
హెచ్ఎమ్పీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్ -19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే, దీనిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఈ కొత్త వైరస్ లక్షణాలు, ఎలా వ్యాపిస్తుంది, నివారణ చర్యలు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కొవిడ్ తరహా లక్షణాలే…
ఈ వైరస్ సోకిన వారిలో కొవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తాయని తెలిసింది. దగ్గు, జ్వరం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. వైరస్ తీవ్రమైతే బ్రోన్కైటిస్, న్యుమోనియా వంటి సమస్యలకు దారితీస్తుంది. మూడు లేదా ఆరురోజుల వరకూ లక్షణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి లక్షణాలు వేర్వేరు వ్యవధిలో ఉంటాయి.
కరోనా మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ ఈజీగా సోకుతుంది. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ దరి చేరకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చేతులను తరచూ సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం.. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, రద్దీ ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండడం వంటివి తప్పనిసరిగా పాటించాలి. తద్వారా వైరస్ వ్యాప్తిని కాస్తమేర కట్టడి చేసే అవకాశం ఉంటుంది.
Also Read..
HMPV | చైనాలో మరో మహమ్మారి.. మృతులతో నిండిపోతున్న శ్మశానాలు ?
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు హైడ్రోజెల్ చికిత్స.. అభివృద్ధి చేసిన ఐఐటీ గువాహటి
Kolhapur | డాక్టర్లు చనిపోయాడన్నారు.. స్పీడ్బ్రేకర్తో ప్రాణం తిరిగొచ్చింది!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

