Kolhapur | ముంబై, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రోడ్లపై ఉన్న స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండొచ్చు. కానీ మరణించాడనుకున్న ఒక వ్యక్తి స్పీడ్ బ్రేకర్ వల్ల తిరిగి బతికిన విచిత్ర సంఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగింది. కస్బా బావ్డాకు చెందిన పాండురంగ్ ఉల్పేకు డిసెంబర్ 16న ధ్యానంలో ఉండగా గుండెపోటు వచ్చింది.
కుటుంబ సభ్యులు వెంటనే దవాఖానలో చేర్పించగా అతడిలో ఎలాంటి చలనం లేకపోవడంతో మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఉల్పే దేహాన్ని ఇంటికి తరలిస్తుండగా, స్పీడ్‌బ్రేకర్ వల్ల అంబులెన్స్ భారీ కుదుపునకు గురైంది. దీంతో పాండురంగ్ శరీరంలో కదలికలు వచ్చాయి. వెంటనే అతడిని దవాఖానకు తరలించగా వైద్యులు చికిత్స చేసి 15 రోజుల తర్వాత డిశ్చార్జి చేశారు.