RS Praveen Kumar | ఇలా చేస్తే పోలీసుల ఆత్మహత్యలను ఆపవచ్చు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక సందేశం
RS Praveen Kumar | రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న పోలీసుల ఆత్మహత్యలపై మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ఆత్మహత్యలను ఆపేందుకు ఏం చేయాలనే విషయాలపై ఆయన ఓ కీలక సందేశం ఇచ్చారు.
RS Praveen Kumar | హైదరాబాద్ : రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న పోలీసుల ఆత్మహత్యలపై మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ఆత్మహత్యలను ఆపేందుకు ఏం చేయాలనే విషయాలపై ఆయన ఓ కీలక సందేశం ఇచ్చారు. తన అనుభావాలను పంచుకుంటూ.. పోలీసు ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణలో గత 30 రోజుల్లోనే ఆరు మంది పోలీసులు తమ విలువైన ప్రాణాలను చేజేతులా నాశనం చేసుకున్నారని ఆర్ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న కూడా ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పరంపర ఇంతటితో ఆగాలి అని ఆయన అన్నారు.
ప్రియమైన పోలీసు మిత్రులారా..
గత ముప్పై సంవత్సరాలుగా నేనూ ఆయుధాల మధ్యనే బతుకుతున్నా. సర్వీసులో ఎన్నో చెప్పుకోలేని అవమానాలు, నిరాశలు, సహచరుల అకాల మరణాల్లాంటి ఎన్నో బాధలు ఎదురైనవి. కొన్ని నెలల తరబడి పోస్టింగ్ ఇవ్వకుండా నన్ను ఇంట్లో కూర్చోబెట్టారు కూడా. అయినా కూడా నేను ఎన్నడూ తాగుడుకు బానిస కాలేదు. నాకు ఎన్నడూ చావాలనిపించలేదు. భవిష్యత్తులో కూడా నాకు ఈ ఆలోచన రాదు. ఆ రహస్యం ఏంటో మీకు చెప్పాలని ఉంది. దీని వల్ల మీరు సజీవంగా, మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయనే చిన్న ఆశ నాకు ఉంది.
నేను ఐపీయస్ అధికారిని ఐనా, నాదీ మీ అందరి లాంటి నేపథ్యమే. మారుమూల ప్రాంతాల్లో చదవడం, మంచి అవకాశాల కోసం నగరాలకు రావడం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏదో సాధించాలనే పట్టుదల తో రాత్రింబవళ్లు చదవడం, చివరికి విజయం సాధించడం.. తరువాత పోలీసు అకాడమీలో ట్రైనింగ్ ఒక గొప్ప అనుభూతి. అది జీవితానికి ఒక గొప్ప క్రమశిక్షణను అలవాటు చేసింది. మూడు దశాబ్దాలుగా నాకు వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని (పోలీసు ఉద్యోగం) నిరంతరం ప్రజలకు నాకు చేతనైనంత మేలు చేయడానికే వాడాను. మీరు కూడా అలాగే వాడాలి. ఈ విషయాన్ని చాలా రోజుల తరువాత విక్టర్ ఫ్రాంకెల్ రాసిన ‘అర్థం కోసం అన్వేషణ’ పుస్తకం లో చదివాను. మీరు కూడా చదవండి. మీకు చావాలనిపించదు.
నేను పోలీసు ఉన్నతాధికారి కావడం వల్ల నేను పుట్టి పెరిగిన ఊరు చివర్లో ఉన్న మా కాలనీ ప్రజలకు, నా స్నేహితులకు, ఒక గుర్తింపు దొరికింది. నేను పోలీసు వాహనంలో మా ఊరికి పోయినప్పుడు మా బస్తీ ప్రజల ఆనందానికి అవధుల్లేవు. మీ అందరికీ ఇలాంటి అనుభవాలే ఎదురై ఉంటయి. మీరందరూ, మీ మీ సమూహాల్లో సెలబ్రిటీలు. మీ గురించి మీ తల్లిదండ్రులు మీకు తెలవకుండా చాలా గొప్పగా ఊర్లో చెప్పుకుంటరు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు మీ కుటుంబాలకు, మీ సమాజానికి సమూహానికి ఒక గొప్ప బలం. మనంతటికి మనం ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఆలోచించండి.
అసలు రోజూ చావులను ఎఫ్ఐఆర్లు, పంచనామాలు, పోస్టుమార్టంల రూపంలో చూసే మనకు చావాలన్న ఆలోచన రావడమే విడ్డూరంగా ఉంది! అయినా మనుషుల ప్రాణాలను కాపాడడానికి జీతం తీసుకునే మనం, మన ప్రాణాలు మనమే తీసుకొనుడేంది??
మీకు తెలుసా?
మన వల్ల మనకు తెలియకుండానే ఎన్నో జీవితాలు రోజూ సురక్షితంగా ఉంటాయో? గొప్ప విలువ ఉన్న ఇలాంటి జీవితాన్ని, ఒక పిరికి ఆలోచనతో క్షణికావేశంలో నాశనం చేసుకోకూడదు. మనం చేసే చిన్న చిన్న తప్పుల గురించి రోజుల తరబడి ఆలోచించే సమయం ఎవరికీ లేదు. తప్పులను డిలీట్ చేసుకొని మనం ముందుకు సాగాల్సిందే. నిజం చెప్పాలంటే ఎవరి బతుకుల్లో వారు బిజీగా ఉన్నారు. ఆరోగ్యం బాగాలేక పోతే డాక్టర్ దగ్గరికి పోవాలి. మరో మహిళ/పురుషుడు మన జీవితాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తే అర్జెంటుగా మన జీవిత భాగస్వామితో ఆ విషయాన్ని నిర్మొహమాటంగా షేర్ చేసుకోవాలి.. పరిష్కారం కనుగొనాలి. అంతే గాని అందరికీ తెలుస్తదని భయపడి ప్రాణాలు తీసుకుంటే మీ పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డు మీద పడరా? నా అనుభవంతో, కొంతమంది నిపుణులు, పోలీసు ఆఫీసర్లతో మాట్లాడి కింది సలహాలను ఇస్తున్నాను. దయచేసి చదవండి-పాటించండి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన సందేశంలో పేర్కొన్నారు.
పోలీసు ఉన్నతాధికారులకు విన్నపం:
🙏
1. పోలీసు ట్రైనింగ్ లో ఏదో తీవ్రమైన లోపం ఉంది. అవుట్ డోర్ ను కొంత కఠినతరం చేయండి. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఉండేట్లు తయారు చేయండి. కొంతమందికి మందికి సెల్యూట్ కూడా సరిగా రావడం లేదు.
2. పోలీసు కుటుంబాలకు కు ఉచిత కౌన్సిలర్ సౌకర్యం కల్పించండి.… pic.twitter.com/9AO75zzNGr— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) January 3, 2025
ఇవి కూడా చదవండి..
Harish Rao | అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడిన చదువుల తల్లి సావిత్రీ బాయి ఫూలే : హరీశ్‌రావు
Cold Weather | రాష్ట్రంలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అత్యల్పంగా సిర్పూర్లో 6.5 డిగ్రీలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Priyanka Arul | ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సాహసం.. అంధురాలిగా కొత్త అవతారం,బర్త్‌డే పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
బాలిలో 50 అడుగుల గణేశుడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
Raaka | అల్లు అర్జున్ ‘రాకా’ మ్యూజిక్ డైరెక్టర్‌కు షాక్.. ధనుష్ ‘ఓం’తో సాయి అభ్యంకర్‌పై విమర్శలు!
Supreme Court | రక్తసంబంధ వివాహాలపై చట్టం అవసరం.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Bird Flu Vaccine | స్వదేశీ బర్డ్ ఫ్లూ టీకా వచ్చేసింది.. కోళ్లకు ఒక్కో డోసు ధర రూ.1 నుంచి రూ.2!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

