Anti Oxidants | మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. మనం తీసుకునే పలు ఆహారాల్లో రకరకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. మన శరీరంలో ఎప్పటికప్పుడు ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్‌ను యాంటీ ఆక్సిడెంట్లు నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా కణాలు డ్యామేజ్ అవకుండా చూసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను సైతం పటిష్టం చేస్తాయి. దీంతో తీవ్రమైన క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. కనుక మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ల అవసరం ఎంతగానో ఉంది. ఇక పలు ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు లభించే విధంగా చర్యలు చేపట్టవచ్చు.
బ్లూబెర్రీలు, దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కనుక ఈ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ పండ్లను తినడం వల్ల ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఈ పండ్లను మీరు రోజూ నేరుగా తినవచ్చు. లేదా జ్యూస్‌లు, సలాడ్స్, స్మూతీల రూపంలో తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే అకాయ్ బెర్రీస్ అనే ఓ రకమైన బెర్రీ పండ్లలోనూ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని 100 గ్రాముల వరకు తింటే సుమారుగా 400 నుంచి 500 మిల్లీగ్రాముల మేర యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ పండ్లలో ఆంథోసయనిన్స్ అనే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. ఇవి మన శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గుతాయి.
క్రాన్ బెర్రీలను తరచూ తీసుకోవడం వల్ల కూడా యాంటీ ఆక్సిడెంట్లను పొందవచ్చు. ఈ పండ్లలో ప్రో ఆంథోసయనైడిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. అందువల్ల ఈ పండ్లను 100 గ్రాముల మేర తింటే సుమారుఆ 250 నుంచి 300 మిల్లీగ్రాముల మేర యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి మనల్ని రక్షిస్తాయి. ఇక యాంటీ ఆక్సిడెంట్లు లభించాలంటే రోజూ ఒక నారింజ పండును తిన్నా చాలు. ఈ పండ్లలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. 100 గ్రాముల నారింజ పండ్లను తింటే సుమారుగా 180 నుంచి 200 మిల్లీగ్రాముల మేర యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
చెర్రీ పండ్లలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగానే ఉంటాయి. ఈ పండ్లలో ఆంథో సయనిన్స్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. 100 గ్రాముల చెర్రీ పండ్లను తింటే 250 నుంచి 300 మిల్లీగ్రాముల మేర యాంటీ ఆక్సిడెంట్లను పొందవచ్చు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అదేవిధంగా దానిమ్మ పండ్లను కూడా తినవచ్చు. ఈ పండ్లలో ఆంథో సయనిన్స్ ఉంటాయి. 100 గ్రాముల దానిమ్మ పండ్లను తింటే 250 నుంచి 300 మిల్లీగ్రాముల మేర యాంటీ ఆక్సిడెంట్లను పొందవచ్చు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి మనల్ని రక్షించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. స్ట్రాబెర్రీలలోనూ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగానే ఉంటాయి. వీటిల్లో విటమిన్ సితోపాటు ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా మారి మనకు రక్షణను అందిస్తాయి. ఇలా పలు రకాల పండ్లను తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లను పొందవచ్చు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.