Mission Bhageeratha | జహీరాబాద్ , సెప్టెంబర్ 21 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులోని మిషన్ భగీరథ పథకం కింద పని చేసే కార్మికులకు గత 8 నెలలకు సంబంధించి వేతనాలను అధికారులు చెల్లించకపోవడంతో శనివారం రాత్రి నుంచి తాగునీటి సరఫరాను నిలిపివేసి ఆందోళన బాట పెట్టారు. దీంతో న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్ మండలాల పరిధిలోని సుమారు 73 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
దసరా పండుగ సందర్భంగా ఆయా మండలాల్లోని గ్రామాల్లో భవాని మాత ప్రతిష్టాపన కోసం ప్రజలు ఇండ్లను శుద్ధి చేసుకోవడం, బట్టలను ఉతికి వేసేందుకు నీళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో గ్రామాల సమీపంలోని వాగులు, కుంటలు, బోరు బావుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 8 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబపోషణ భారంగా మారిందని కార్మికులు మిషన్ భగీరథ కార్మికులు పోరుబాట పట్టడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కార్మికుల వేతనాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వేతనాలకు సంబంధించి జీకేఆర్ కంపెనీ ప్రతినిధులకు చెక్కులను అందజేయడం జరిగిందని సంబంధిత అధికారులు రెండు మూడు రోజుల్లో వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని జీకేఆర్ కంపెనీ ప్రతినిధులు పేర్కొనగా.. తమకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లిస్తేనే తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని మిషన్ బాధ్యత కార్మికులు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుని కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించి మిషన్ భగీరథ తాగునీటి సరఫరా అన్నియుల చర్యలు తీసుకోవాలని మండలాల ప్రజలు కోరుతున్నారు.
Tandur | ఇరువైపులా తుమ్మ చెట్లు – ప్రమాదాలకు గురువుతున్న వాహనాదారులు