తాండూర్ : వాతావరణ సమతుల్యతకు చెట్లు పెంచాలనే ఉద్ధేశం వాస్తవమేగాని రోడ్డుకు ఇరువైపులా ఏపుగా ప్రయాణానికి అడ్డుగా ఉన్న చెట్ల ( Trees ) మొక్కల తొలగింపుపై సంబంధిత అధికారులు ఎనలేని జాప్యం చేస్తున్నారు. ఫలితంగా రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలకు ( Accidents ) కారణమవుతున్నాయి.
మంచిర్యాల (Mancherial ) జిల్లా తాండూర్ మండల కేంద్రం కస్తూర్భా గాంధీ పాఠశాల నుంచి రేచిని రోడ్ రైల్వే స్టేషన్ వెళ్లే రహదారి వెంట రోడ్డుకు ఇరువైపులా పెరిగిన తుమ్మ చెట్లతో రోడ్డు కనిపించకుండా పోతుంది. దీంతో రోడ్డు వెంబడి వెళ్లే వాహనదారులకు ఇబ్బందిగా మారింది. చెట్ల కొమ్మలు రోడ్డు మీదకు రావడంతో వాహనదారులకు చెట్ల కొమ్మలు తగులుతున్నాయి. దీంతో ఎదురుగా వచ్చే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
రాత్రి వేళల్లో చెట్ల కొమ్మలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనదారులకు రాకపోకలకు ఇబ్బంది తప్పడం లేదు. సంబంధిత అధికారులు వాహనదారులకు ఇబ్బంది లేకుండా తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించాలని వాహనదారులు, ప్రజలు అధికారులను కోరుతున్నారు.