Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రసంగంలో 420 అబద్దాలు.. అన్నీ 420 మాటలేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో హరీశ్ రావు మాట్లాడుతూ.. పంద్రాగస్టు రోజు పోరాట యోధుల గురించి తలచుకుంటారు.. స్వాతంత్య్రోద్యమ ఫలితాల గురించి మాట్లాడుతారు.. ఏ ప్రధానమంత్రి , ముఖ్యమంత్రి అయినా కూడా దేశ అభివృద్ధి, దేశ సమగ్రత, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడుతారు..కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా చిల్లర మాటలు, రోత మాటలు మాట్లాడటం ఒక్క ఆయనకే చెల్లింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఇంత రోత మాటలు, చిల్లర మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి బహూశా ఎవరూ ఉండరేమో అన్నారు.
ముఖ్యమంత్రి అయిన మూడేళ్ల తర్వాత కూడా గవే చిల్లర మాటలు.. గోబెల్స్ ప్రచారం.. ముఖ్యమంత్రి 4:20 నిమిషాలకు ఉపన్యాసం ప్రారంభించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు.. రేవంత్ రెడ్డి ప్రసంగంలో 420 అబద్దాలు.. అన్నీ 420 మాటలేనని మండిపడ్డారు. ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డికి వచ్చినవ్.. ఒక్కమాట ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించో,, సంగారెడ్డి గురించో మాట్లాడినవా.. ? సంగారెడ్డికి కొత్తగా ఒక్క రూపాయి హామీ అయినా ఇచ్చినవా..? నీ ప్రభుత్వం తప్పిదం, నీ చేతగాని తనం వల్ల సింగూరు ఖాళీ చేసినవ్. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఇవాళ మంచినీళ్లు లేవు. నారాయణ ఖేడ్లో రెండు రోజులకోసారి నల్లా వస్తుంది. కరువు కాలంలో కూడా ఎండాకాలంలో కేసీఆర్ తండాతండాకు రాష్ట్రం మొత్తం మంచినీళ్లు ఇస్తే.. నువ్వు సింగూరు రిపేర్ చేస్తా అని ఖాళీ చేసినవ్. పోని రిపేర్ అన్నా చేస్తవా అంటే అది కూడా చేయలేదన్నారు.
నేడు సింగూరులో నీళ్లు లేక మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో రెండు, మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తున్నది. ప్రత్యామ్నాయం ఏమైనా మాట్లాడుతవేమో.. ఆ ప్రజలకు మంచినీళ్ల కోసం ఆ ట్యాంకర్లు తెస్తవా.. బోర్లు వేస్తవా.. మోటార్లు పెడతావా… ప్రతీ రోజునల్లా నీళ్లు రావడానికి ఏం చేస్తవ్..? ఓ మాట చెప్తవేమో అనుకుంటే దాని గురించి దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడడని అన్నారు. ఆనాడు కేసీఆర్ సంగారెడ్డి బాగుపడాలే.. సంగారెడ్డి జిల్లాకు సాగునీరు ఇయ్యాలే అని సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టును ప్రారంభిస్తే.. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడేళ్లలో దాన్ని మూలకు పడేసినవ్. కనీసం ఇవాళ జిల్లాకొచ్చినవ్. ఆ గమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు పనులు చేయిస్తా.. రెండేళ్లలో నీళ్లిస్తా అని చెప్తావేమో అంటే సంగమేశ్వర గురించి మాట్లాడే కానీ సొల్లు మాటలు మాట్లాడివని హరీశ్ రావు మండిపడ్డారు.
LIVE: Former Minister and MLA @BRSHarish Press Meet in Siddipethttps://t.co/QOhfLMiY9d
— BRS Party (@BRSparty) August 15, 2026
Weekend OTT | ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన చిత్రాలివే!
FBI Report | అమెరికాలో భారీగా తగ్గిన హత్యల రేటు.. గడిచిన 75 ఏళ్లలో అత్యంత కనిష్ఠం..!
Rosemary Oil | జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రోజ్మేరీ ఆయిల్..అధ్యయనంలో వెల్లడి..