హనుమాన్ జన్మస్థలంపై తిరుమలలో ప్రారంభమైన చర్చలు
హనుమాన్ జన్మస్థలంపై తిరుమలలో ప్రారంభమైన చర్చలు | హనుమాన్ జన్మస్థలంపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉన్నది. తిరుమలలోని జపాలి తీర్థమే హనుమాన్ జన్మస్థలం అని టీటీడీ చెబుతుండగా.. కాదు కిష్కిందే మారుతి జన్మస్థలమని తీర్థ క్షేత్ర ట్రస్ట్ వాదిస్తోంది.

తిరుమల : హనుమాన్ జన్మస్థలంపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉన్నది. తిరుమలలోని జపాలి తీర్థమే హనుమాన్ జన్మస్థలం అని టీటీడీ చెబుతుండగా.. కాదు కిష్కిందే మారుతి జన్మస్థలమని తీర్థ క్షేత్ర ట్రస్ట్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీతో తీర్థ క్షేత్ర ట్రస్ట్ చర్చకు సిద్ధమైంది. అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానం అంటూ శ్రీరామనవమి పర్వదినం రోజు టీటీడీ చేసిన ప్రకటనను ఖండిస్తూ పలుసార్లు లేఖ రాసిన కిష్కింద ట్రస్ట్ చర్చలకు ముందుకు వచ్చింది. తిరుపతి రాష్ట్రీయ సంస్కృత పీఠాన్ని ఇరు వర్గాలు సంవాదానికి వేదికగా నిర్ణయించారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన శ్రీ హనుమద్ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ శ్రీ గోవిందానంద సరస్వతీ.. టీటీడీ కమిటీని చర్చకు రావాలని ఆహ్వానించారు. ఈ చర్చ ద్వారా పంపా క్షేత్ర కిష్కింధే మారుతీ జన్మస్థలంగా నిరూపించాలని జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మేరకు టీటీడీకి సమాచారం ఇచ్చారు. గురువారం ఉదయం 10 గంటలకు ఇరువర్గాలు చర్చలను ప్రారంభించాయి. కిష్కింధ ట్రస్ట్ తరఫున గోవిందానంద సరస్వతీ, టీటీడీ తరఫున కమిటీ కన్వీనర్, సభ్యులు చర్చలో పాల్గొంటున్నారు. చర్చల పూర్తయిన అనంతరం వివరాలను మీడియాకు వివరించే అవకాశం ఉన్నది.
ఇవి కూడా చదవండి..
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ఎనిమిది మంది మృతి
మెహుల్ చోక్సీ దొరికాడు..
12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్ సురక్షితం : ఫైజర్
బాదుడే బాదుడు.. 14వసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కరోనా మూలాలపై మూడు నెలల్లో తేల్చాలి.. ఇంటెలిజెన్స్కు బైడెన్ ఆదేశం
దేశంలో 24 గంటల్లో 2.11లక్షల కరోనా కేసులు
సరయూ నదిలో తేలిన మృతదేహాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

