కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో చేస్తున్న చిత్రం సార్ (Sir). తమిళంలో వాథి (Vaathi) అనే టైటిల్‌తో వస్తోంది. ఇప్పటికే విడుదలైన లుక్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. కాగా ఇవాళ దీపావళిని పురస్కరించుకుని మేకర్స్ మరో లుక్ విడుదల చేశారు.
ధనుష్ యాక్షన్ సీన్లో ఉన్న లుక్ ఇంట్రెస్టింగ్గా ఉంది. మేకర్స్ గతంలో ఫిక్స్ చేసిన సార్ విడుదల తేదీ పోస్టర్లో కనిపించడం లేదు. దీపావళి శుభాకాంక్షలు మాత్రమే తెలియజేశారు. దీన్ని బట్టి ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సాయికుమార్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్-ఫార్చూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ భామ సంయుక్తామీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ మ్యూజిక్ డైరెక్టర్. ధనుష్ సార్ సినిమా తెలుగు వెర్షన్‌కు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నట్టు సమాచారం.
Our #Vaathi / #SIR wishes you all a very #HappyDeepavali 🪔#SIRMovie @dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 #SaiSoujanya @Fortune4Cinemas @SitharaEnts #SrikaraStudios @adityamusic pic.twitter.com/VuidNtQZu3
— Sithara Entertainments (@SitharaEnts) October 24, 2022
Read Also : Vaarasudu | దీపావళి విషెస్‌తో విజయ్ అభిమానులకు శుభవార్త.. వారసుడు విడుదల తేదీ ఫైనల్
Read Also : Balakrishna | మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలకృష్ణ.. వివరాలివే