ఢిల్లీ అల్లర్ల కేసులో ముగ్గురికి బెయిల్
ఢిల్లీ అల్లర్ల కేసులో ముగ్గురికి బెయిల్ |

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల కేసులో ఏడాది కిందట అరెస్టయిన పింజ్రాటాడ్ సభ్యులు నటాషా, నర్వాల్, దేవంగన కాలిత, జామియా ఇస్లామియా విద్యార్థి ఆసిఫ్ ఇక్బాల్ తన్హాకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్స్ కోర్టు ముగ్గురికి బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన ఆదేశాలను.. జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్, అనుప్ జైరాం భంబానీల ధర్మాసనం వారికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. రూ.50వేల పూచీకత్తు సమర్పించడం, పాస్‌పోర్టు అప్పగించడంతో పాటు దర్యాప్తును ప్రభావితం చేయడం, చట్టవిరుద్ధమైన కార్యకలాపలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
బెయిల్‌పై పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసన.. ఉగ్రవాదం కాదని.. రాజ్యాంగబద్ధమైన హక్కు అని.. దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. 40 మందికిపైగా మృతి చెందగా.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగ్గా, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు.
దేవాంగన కళిత, నటాషా నర్వాల్ ఇద్దరూ ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పీహెచ్డీ స్కాలర్లు కాగా.. ఆసిఫ్ ఇక్బాల్ తన్హా జామియా యూరివర్సిటీలో బీఏ థర్డ్ ఇయర్ విద్యార్థి. ఈ ముగ్గురూ పింజ్రా టాడ్ అసోసియేట్ అయ్యారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలోని సీలంపూర్ మదీనా మసీదు వద్ద పింజ్రా టాడ్ నిర్వహించిన ఉద్యమాల్లో వారు పాల్గొన్నారు.
ఆందోళనకారులతో కలిసి పెద్ద ఎత్తున ఛక్కా జామ్ చేపట్టారు. హింసాత్మక ఆందోళనల్లో వారి ప్రమేయం ఉందనే కారణంతో యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి జైలులో ఉండగా.. ఆ ముగ్గురికీ తాజాగా బెయిల్ లభించింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సీనియర్ అడ్వోకేట్ ప్రశాంత్ భూషణ్ హర్షం వ్యక్తం చేశారు.
Kudos to the Delhi High court for granting regular bail to Pinjra Tod activists Natasha Narwal & Devangana Kalita, & also to Asif Iqbal Tanha, who were maliciously arrested by Delhi police under UAPA in the Delhi riots case
— Prashant Bhushan (@pbhushan1) June 15, 2021
ఇవి కూడా చదవండి..
Oxygen Levels : ఇవి తినండి.. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోండి
పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?
ఢిల్లీలో రెండు హాస్పిటళ్లలో ‘స్పుత్నిక్-వీ’ పంపిణీ
త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా
రేపు తెరుచుకోనున్న చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలు
Delta effect : బ్రిటన్‌లో జూలై 19 వరకు ఆంక్షల పొడగింపు
నేడు కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేటీఆర్
దేశంలో 60వేలకు దిగివచ్చిన కరోనా కేసులు
దేశంలో డిసెంబర్ నాటికి 20కోట్ల కోవోవాక్స్ టీకాల లభ్యత!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

