‘ఎల్ఐసిలో డిజిన్వెస్ట్మెంట్ను ఉపసంహరించుకోవాలి’
భారత జీవిత బీమా సంస్థలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మరింత వాటాల ఉపసంహరణ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం నల్లగొండ బ్రాంచ్ 1, 2 కార్యాలయాల వద్ద ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో..
– నల్లగొండలో ఐసిఈయు ఆధ్వర్యంలో నిరసన
నల్లగొండ రూరల్, ఆగస్టు 05 : భారత జీవిత బీమా సంస్థలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మరింత వాటాల ఉపసంహరణ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం నల్లగొండ బ్రాంచ్ 1, 2 కార్యాలయాల వద్ద ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ 1, 2 అధ్యక్ష, కార్యదర్శులు కొప్పు వెంకన్న, ఏ.కరుణాకర్ రావు, ఐ.లక్ష్మీనారాయణ, సి.హెచ్.రమేష్, ఏజెంట్ల యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ఈ నెల 3న ప్రకటించిన ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎల్ఐసిలో మరో 2.5 శాతం నుండి 6.5 శాతం వరకు వాటాలను విక్రయించాలని ప్రభుత్వం చూడడం దారుణమన్నారు. మే 2022లో ఐపీవో ద్వారా ఉపసంహరించిన 3.5 శాతానికి అదనంగా మళ్లీ ప్రజల ఆస్తిని మార్కెట్కు కట్టబెట్టడం దేశ ప్రయోజనాలకు విఘాతమని ఆందోళన వ్యక్తం చేశారు.
కోట్లాది మంది పాలసీదారుల నమ్మకంతో నిర్మితమైన ఎల్ఐసి కేవలం లాభాలు తెచ్చే సంస్థ మాత్రమే కాదని, దేశ ఆర్థిక రక్షణకు, అభివృద్ధికి వెన్నుముకగా నిలుస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని, ఎల్ఐసి ప్రభుత్వ రంగ స్వభావాన్ని కాపాడుకునేందుకు కార్మికులు, ప్రజాస్వామ్యవాదులు, పాలసీదారులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఏజెంట్ల యూనియన్ నాయకులు బి.రామలింగం, నలపరాజు సైదులు, దారం వెంకన్న, ఇటికాల ఉపేందర్, దేశగాని కృష్ణ, విజయ్ కుమార్ తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆయా బ్రాంచ్ల ఐసిఈయు నాయకులు యర్కల యాదయ్య, ఎస్.సందీప్, పల్లపు లింగయ్య, మద్దూరు రామకృష్ణ, లెల్లెల శ్రీనివాస్, గుండగోని శ్రీనివాస్, వింజమూరి శ్రీనివాస్, లకడాపురం రామకృష్ణ, దేవగిరి అంజయ్య, కాటం వెంకటేశం, నామని రామకృష్ణ, పరాంకుశం గోపికృష్ణ, బొల్లు సుధాకర్, వేముల శ్రీనివాస్, పెద్ది రమేష్, ఏ.యాదగిరి, చంద్రమోహన్, మహ్మద్ ఆఫ్సర్, జిన్న శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు.

‘ఎల్ఐసిలో డిజిన్వెస్ట్మెంట్ను ఉపసంహరించుకోవాలి’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

