న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్, ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా ఎన్నికల ర్యాలీలపై తాత్కాలిక నిషేధం విధించాలని ఎన్నికల సంఘానికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘కొవిడ్-19 కొత్త కేసులు కోలుకున్న వారి కన్నా వేగంగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. మోదీజీ.. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించండి. ఎన్నికల సంఘం.. ప్రచార ర్యాలీలపై తాత్కాలిక నిషేధం విధించాలి. కోర్టులు ప్రజల ప్రాణాలను రక్షించాలి’ అని కాంగ్రెస్ నేత ట్వీట్ చేశారు.
COVID-19
— Kapil Sibal (@KapilSibal) April 18, 2021
Infections faster than recoveries
Modiji :
Declare a National Health Emergency
Election Commission :
Declare a moratorium on election rallies
Courts :
Protect people’s lives
ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,61,500 కరోనా పాజిటివ్ కేసులు, 1,501 మరణాలు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. తాజాగా 1,38,423 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,88,109కు చేరగా.. 1,28,09,643 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 1,77,150 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 18,01,316 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది.
ఇవి కూడా చదవండి..