Crime news : ఓ గుర్తు తెలియని మహిళను చంపి, గోనె సంచి (Sack) లో కుక్కి, చెత్త లారీ (Garbage truck) లో పడేశారు. కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు.
ఒక వ్యక్తి ఆటోలో వచ్చి, గోనెసంచిని చెత్త లారీలో వేసిన దృశ్యాలు ఓ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. కొన్ని వారాల క్రితం బెంగళూరులోనే ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళను ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి దారుణంగా చంపేశాడు. ఆ ఘటనను మరువకముందే తాజాగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.