Mann Ki Baat : భద్రాచలం జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. భద్రాచలం ఆదివాసి మహిళలు ‘భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్’ పేరిట బిస్కెట్లు తయారు చేస్తున్నారని, ఆ బిస్కెట్లు హైదరాబాద్ నుంచి లండన్‌కు కూడా ఎగుమతి అవుతున్నాయని ప్రధాని వెల్లడించారు. ఈ మహిళలే మూడు నెలల్లో 40 వేల శానిటరీ నాప్కిన్లను తయారు చేసి విక్రయించారని చెప్పారు. వారుని తాను అభినందిస్తున్నానని అన్నారు.
ప్రధాని మోదీ ఆదివారం మన్ కీ బాత్ 123వ ఎపిసోడ్లో మాట్లాడారు. ఆలిండియా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ ట్రకోమా రహిత దేశంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. అదేవిధంగా యోగా డే గురించి కూడా ఆయన ప్రస్తావించారు. యోగాలో డే లో లక్షలమంది పాల్గొన్నారని చెప్పారు.
అదేవిధంగా 1975లో నాటి ప్రధాని దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు.
ఎమర్జెన్సీపై నాడు మొరార్జీ దేశాయ్, వాజ్‌పేయి, బాబూ జగ్జీవన్ రామ్ లాంటి నేతలు చేసిన ప్రసంగాలను వినిపించారు. మేఘాలయ ఎరీసిల్క్‌కు జీఐ ట్యాగ్ లభించిందని చెప్పారు. పురుగులను చంపకుండా వస్త్రాన్ని తయారు చేయడం దాని ప్రత్యేకత అని చెప్పారు.