TSRDA | జూలై 1 నుంచి సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల సమ్మె
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ (TSRDA) జూలై 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టనుంది.
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ (TSRDA) జూలై 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీఏ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నోసార్లు ప్రభుత్వం, వైద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రుల్లో పని చేస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు గత మూడు నెలలుగా స్టైపెండ్ చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న స్టైపెండ్ పెంపు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, అలాగే రెసిడెంట్ల ఉద్యోగ కాలాన్ని కొనసాగించేందుకు కీలకమైన ఎక్స్టెన్షన్ జీవో ఇంకా విడుదల చేయబడలేదని వాపోయారు. అధికారులతో చేసిన అనేక ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు జూలై 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. అత్యవసర వైద్య సేవలపై సమ్మె ప్రభావం ఉండదని, తమ డిమాండ్లు నెరవేరిన తరువాతే సమ్మెను విరమిస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి, వైద్య సేవలలో అంతరాయం కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

