Russia attack | 477 డ్రోన్లు, 60 క్షిపణులు.. ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి
Russia attack | రష్యా- ఉక్రెయిన్ (Russia vs Ukraine) దేశాల మధ్య యుద్ధం ఏండ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో రెండు దేశాలు పెద్ద ఎత్తున సైనికులను, పౌరులను కోల్పోయాయి.
Russia attack : రష్యా- ఉక్రెయిన్ (Russia vs Ukraine) దేశాల మధ్య యుద్ధం ఏండ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో రెండు దేశాలు పెద్ద ఎత్తున సైనికులను, పౌరులను కోల్పోయాయి. ఈ నేపథ్యంలోనే రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి గతంలో ఎన్నడూ చేయనంత భారీ స్థాయిలో ఉక్రెయిన్ (Ukraine) పై వైమానిక దాడులు (Air strikes) చేసింది.
గత రాత్రి రష్యా 477 డ్రోన్లు, 60 క్షిపణులు ఉన్నాయని ఉక్రెయిన్ వాయుసేన వెల్లడించింది. వాటిలో 249 డ్రోన్లను కూల్చేశామని, మరో 226 డ్రోన్లు ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థలవల్ల వాటంతటవే కూలిపోయాయని తెలిపింది. ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ కమ్యూనికేషన్ కమాండర్ యూరీ ఇహ్నాట్ మాట్లాడుతూ.. గత రాత్రి అతిపెద్ద దాడి జరిగిందని తెలిపారు.
ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఆయుధాలను ప్రయోగించినట్లు ఇహ్నాట్ చెప్పారు. పోలాండ్ గగనతల రక్షణ కోసం మిత్ర దేశాల యుద్ధ విమానాలు రంగంలోకి దిగినట్లు తెలిపారు. ఖెర్సాన్ ప్రావిన్సులో జరిగిన దాడుల్లో ఒకరు మరణించినట్లు అక్కడి గవర్నర్ వెల్లడించారు. కాగా రష్యాలో వేర్పాటువాదాన్ని పశ్చిమ దేశాలు ప్రోత్సహిస్తున్నాయని, ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో జోక్యం చేసుకుంటున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు.
Read More >>
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. హమాస్ కీలక నేత హతం
ఎయిరిండియా విమాన ప్రమాదంలో కుట్ర కోణంపై దర్యాప్తు : కేంద్రం
భద్రాచలం ఆదివాసి మహిళలపై ప్రధాని మోదీ ప్రశంసలు
పాకిస్థాన్ సైన్యానివి తప్పుడు ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన భారత్
భారత్ ట్రకోమా రహిత దేశం.. WHO ప్రకటించింది : ప్రధాని మోదీ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

