Stampede : పూరీ జగన్నాథస్వామి రథయాత్ర (Puri Jagannath Rath Yatra) లో జరిగిన తొక్కిసలాట మృతులకు ఒడిశా ముఖ్యమంత్రి (Odisha CM) మోహన్ చరణ్ యాదవ్ (Mohan Charan Majhi) ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
దీనికి సంబంధించి ఒడిశా సీఎంవో ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీ జగన్నాథ రథయాత్రను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగిందని సీఎం వెల్లడించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. రథయాత్రలో ఆపశృతి చోటుచేసుకున్నందుకు ఒడిశా సీఎం భక్తులకు క్షమాపణలు చెప్పారు.
కాగా తొక్కిసలాటలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో తొక్కిసలాటకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం మోహన్ చరణ్ అధికారులను ఆదేశించారు.