CPM | మధిర : సాగర్ జలాలతో చెరువులు నింపి పంటలను కాపాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. ఇవాళ దివ్వల వీరయ్య అధ్యక్షతన సీపీఎం మధిర నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ.. పంట పొలాలు నీళ్లందక ఎండిపోతున్నాయని.. చివరి భూముల వరకు సాగర్ జలాలు అందించాలన్నారు. సాగర్ నీటితో చెరువులన్నీ నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న, మిర్చి, పండ్ల తోటల రైతులు సాగర్ జలాల కోసం ఎదురుచూస్తున్నారు. మిర్చికి గిట్టుబాటు ధరను క్వింటాల్‌కు రూ.25 వేల చొప్పున ఇవ్వాలన్నారు. మిర్చి బోర్డు ఏర్పాటు చేసి.. మిర్చి పంటను ఆహార పంటల జాబితాలో చేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు.
జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేయాలని రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు కొత్త పెన్షన్లు విడుదల చేయాలని.. పెన్షన్లను 4 వేల రూపాయలకు పెంచాలని వికలాంగులకు 6వేలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పార్టీ డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి పద్మ శీలం నరసింహారావు, దొండపాటి నాగేశ్వరరావు, మందా సైదులు, బట్టు పురుషోత్తం, కిలారు సురేషు, రచబంటి రాము, పడికంటి మురళి, మద్ధాలా ప్రభాకర్, పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మీడియాకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు
Madhabi Puri Buch | సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
AC Bus Shelter | బోరబండలో ఏసీ బస్ షెల్టర్ కబ్జా.. కిరాయికి ఇవ్వటానికి రెడీస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు