e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News క‌రోనా మృతుల బీమా క్లెయిమ్స్‌: రూ.1,986 కోట్లు

క‌రోనా మృతుల బీమా క్లెయిమ్స్‌: రూ.1,986 కోట్లు

క‌రోనా మృతుల బీమా క్లెయిమ్స్‌: రూ.1,986 కోట్లు

న్యూఢిల్లీ: బీమా సంస్థలకు కరోనా వైరస్‌ సెగ పెద్ద ఎత్తునే తగులుతున్నది. ఈ మహమ్మారితో మరణించిన వారి క్లెయిములు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు పోటెత్తుతున్నాయి మరి.

ఈ నెల 25 నాటికి 24 బీమా కంపెనీలు మొత్తం 25,500 కొవిడ్‌-19 డెత్‌ క్లెయిమ్స్‌కు చేసిన చెల్లింపుల విలువ ఏకంగా రూ.1,986 కోట్లుగా ఉండటం గమనార్హం.

ఈ మేరకు జీవిత బీమా మండలి గణాంకాలు చెప్తుండగా, ఏటా వచ్చే సాధారణ మరణాల క్లెయిములతో పోల్చితే ఇది ఎంతో ఎక్కువని పేర్కొంటున్నారు.

లాభాలపై ప్రభావం
బీమా సంస్థల మనుగడను కరోనా వైరస్‌ ఇప్పటికిప్పుడు ప్రభావితం చేయకపోయినప్పటికీ.. కంపెనీల లాభాలు మాత్రం పడిపోతుండటం భారీ విపత్తుకు హెచ్చరికగా నిలుస్తున్నదని పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

ఈ క్రమంలోనే గడిచిన ఏడాది కాలంలో ఎస్బీఐ లైఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ సంస్థలకు ఐదేసి వేల క్లెయిములు రాగా, రూ.340 కోట్ల చొప్పున చెల్లించినట్లు సమాచారం. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కు 1,700 క్లెయిములు వచ్చినట్లు తెలుస్తున్నది.

పెరుగనున్న ప్రీమియంలు
కరోనా ప్రభావ పరిస్థితుల దృష్ట్యా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల ప్రీమియంలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది చనిపోతుండటం, పెరిగిన క్లెయిములు.. కిస్తీల ధరలను పెంచేందుకు బీమా సంస్థలను ఉసిగొల్పుతున్నాయి.

నిజానికి గతేడాది ఏప్రిల్‌లోనే ప్రీమియం ధరలను 25-30 శాతం మేర లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు పెంచాయి. మళ్లీ ఇప్పుడు 10-20 శాతం పెంచేందుకు సిద్ధమయ్యాయి.

ఇవి కూడా చ‌ద‌వండి:

మోటార్ ఫీల్డ్‌కు జంట స‌వాళ్లు: కండ‌క్ట‌ర్ల కొర‌త+చిప్‌ల ధ‌ర‌లు పైపైకి..!!

చిప్‌ల కొర‌త‌.. ఎందుకిలా..

ఇండ్ల‌‌కు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్‌’ ప్రియారిటీ!

ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్‌ ఈజీ..

ఇల్లు కొనే వారికి అద్భుత అవ‌కాశం.. సీఎల్ఎస్ఎస్ స‌బ్సిడీలివే..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క‌రోనా మృతుల బీమా క్లెయిమ్స్‌: రూ.1,986 కోట్లు

ట్రెండింగ్‌

Advertisement