Mouni Rai – Suraj Nambiar : బాలీవుడ్ నటి మౌనీ రాయ్(Mouni Rai) విడాకుల వార్తలు నిజమయ్యాయి. భర్త సూరజ్ నంబియార్ (Suraj Nambiar) నుంచి ఆమె విడిపోయింది. సూరజ్‌తో నాలుగేళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని గురువారం మౌనీ రాయ్, సూరజ్ ఇద్దరూ సంయుక్తంగా ప్రకటించారు. ఔను.. మేము విడిపోతున్నాం అని ఎక్స్ వేదికగా వెల్లడించారిద్దరు. ఈ సమయంలో తమ గోపత్యకు భంగం కలిగించరాదని మీడియా, అభిమానులను మౌనీ రాయ్ కోరింది.
తమ వ్యక్తిగత జీవతం గురించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలకు సినీ నటి మౌనీ రాయ్ చెక్ పెట్టింది. భర్త సూరజ్ నంబియార్‌తో విడాకులు తీసుకోబోతోందనే వదంతులు నిజమేనని చెప్పేసింది. తమ విడాకుల విషయాన్ని గురువారం మౌనీ, సూరజ్‌లు సంయుక్తంగా వెల్లడించారు.
TV actress Mouni Roy and businessman Suraj Nambiar announced their separation on Thursday (May 14) after four years of marriage.
The couple shared a joint statement on Instagram confirming the news.
Read more: https://t.co/S5pcHAukWk pic.twitter.com/6ebVvLe3uT
— The Guwahati Times (@theghytimes) May 14, 2026
‘మా వ్యక్తిగత జీవితం గురించి కొన్ని మీడియా సంస్థలు అనవసరంగా ప్రస్తావించడం బాధేసింది. ఈ సందర్భంగా మీ అందరికి ఓ విషయం చెప్పాలనకుంటున్నాం. మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. విడాకులకు సంబంధించిన విషయాన్ని సమయం వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాం. మా వ్యక్తిగత జీవితాన్ని సంచలనంగా మార్చడానికి చాలా మంది ప్రయత్నించారు. అబద్దాలతో తమకు తోచిన కథలు అల్లారు. అవేవీ మా అనుబంధంలోని వాస్తవికతను ప్రతిబింబించవు.
#MouniRoy and #SurajNambiar have officially announced their separation!! 💔 pic.twitter.com/LZantG52Ht
— Indian Cinema 🇮🇳 (@Indiancinema_in) May 14, 2026
వ్యక్తిగత ప్రాధాన్యాల దృష్ట్యా ఇద్దరం పరస్పర అంగీకారంతోనే గౌరవంగా.. అర్ధం చేసుకొని భిన్న దారుల్లో నడవాలని భావించాం. ఈ సమయంలో మేము ఈ దశను గోప్యంగా, ఆలోచనాయుతంగా దాటడంపై దృష్టి సారిస్తున్నాం. ఇకపై స్నేహితులుగా కొనసాగుతాం. ఈ సందర్భంగా మమ్మల్ని అర్ధం చేసుకొని మా గోప్యతను గౌరవిస్తున్నందుకు మీ అందరినీ అభినందిస్తున్నాం. ఈ సమయంలో మీ అందరూ మాకు మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాం. ఇట్లు.. మౌనీ, సూరజ్’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.
“We have decided to part ways…”: Mouni Roy, Suraj Nambiar announce separation in joint statement
Read @ANI Story |https://t.co/9ln3qp545N#mouniroy #surajnambiar #mutualdecision pic.twitter.com/jE6hEH6eTR
— ANI Digital (@ani_digital) May 14, 2026
మహదేవ్, నాగిని సిరీస్‌తో పాపులరైన మౌనీ రాయ్, బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ 2022 జనవరి 27న గోవాలో పెళ్లి చేసుకున్నారు. మౌనీ కుటుంబ సంప్రదాయాన్ని అనుసరిస్తూ మలయాళీ పద్ధతిలో, సూరజ్ కుటుంబ పద్ధతిని పాటిస్తూ బెంగాళీ సంప్రదాయల్లో వీరి వివాహం జరిగింది. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారిద్దరూ.