అగ్రిమెంట్ ఉంటేనే ధాన్యం
దులు వంటి సమస్యలకు చెక్ పెట్టే దిశగా సివిల్ సప్లయ్ కీలక నిర్ణయం తీసీఎమ్మార్లో ఇకపై మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడనున్నది. ఇష్టమొచ్చినట్టు ధాన్యం ఇవ్వడం, తీసుకోవడం, తిరిగి బియ్యం ఇవ్వడంలో ఇబ్బంసుకున్నది.
-
సీఎమ్మార్ కేటాయింపులో సివిల్ సైప్లె కొత్త నిబంధనలు
-
మిల్లర్, సివిల్‌సైప్లె మధ్య ఒప్పందం తప్పనిసరి
-
ఇకనుంచి అసోసియేషన్ గ్యారెంటీ చెల్లదు
-
ఒక మిల్లు మరో మిల్లుకు గ్యారెంటీ ఇవ్వాల్సిందే
-
మిల్లు డిఫాల్ట్ అయితే.. బాధ్యత గ్యారెంటర్దే
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): దులు వంటి సమస్యలకు చెక్ పెట్టే దిశగా సివిల్ సప్లయ్ కీలక నిర్ణయం తీసీఎమ్మార్లో ఇకపై మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడనున్నది. ఇష్టమొచ్చినట్టు ధాన్యం ఇవ్వడం, తీసుకోవడం, తిరిగి బియ్యం ఇవ్వడంలో ఇబ్బంసుకున్నది. ఈ మేరకు 2026-27 సీఎమ్మార్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. దీని ప్రకారం మిల్లర్లు సివిల్ సప్లయ్‌తో ముందు ఒప్పం దం చేసుకుంటేనే ధాన్యం ఇస్తారు, లేకపోతే మిల్లుకు కేటాయింపులు నిలిపివేస్తారు. గతంలో ధాన్యం కేటాయించిన తర్వాత మిల్లుతో అగ్రిమెంట్ అయ్యేది. దీని వల్ల ఇచ్చిన ధాన్యానికి, మిల్లు కెపాసిటీకి, మిల్లర్ ఆర్థిక పరిస్థితితో ఎలాంటి సంబంధం ఉండేది కాదు. దీంతో మిల్లర్లు ఇష్టారాజ్యం ఉండేది. ఇకపై నుంచి కచ్చితంగా నిబంధనల ప్రకారమే కేటాయించనున్నారు.
గ్యారెంటర్లదే బాధ్యత..
గతంలో సీఎమ్మాఆర్ కేటాయించే మిల్లుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కు సంబంధించి జిల్లా, రాష్ట్ర కమిటీ నుంచి గ్యారెంటీ లేఖ ఇచ్చేవారు. దీని వల్ల ప్రయోజనం లేదని గుర్తించిన అధికారులు ఈ నిబంధనను తొలగించారు. ఇకపై అసోసియేషన్ లేఖను పరిగణించవద్దని నిర్ణయించారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఒక మిల్లుకు రెండు మిల్లుల నుంచి పూచీకత్తులు తీసుకోవాలని నిర్ణయించారు. ఒకవేళ సదరు మిల్లర్ బియ్యం ఇవ్వకుండా, ధాన్యం పక్కదారి పట్టించి డిఫాల్ట్ అయితే ఆ బాధ్యత గ్యారెంటర్లదే. జరిగిన నష్టాన్ని గ్యారెంటీ ఇచ్చిన మిల్లర్ల నుంచి వసూలు చేయాలని నిబంధన పెట్టారు.
ఆస్తులు వెల్లడించాలి.. ‘మా ఇష్ట ప్రకారమే’ అని అఫిడవిట్ ఇవ్వాలి
మిల్లర్ల గ్యారెంటీలతోపాటు మరికొన్ని కఠిన నిబంధనలు కూడా పొందుపరిచారు. ఇందులో మిల్లర్లు వారికిచ్చే ధాన్యం విలువలో 5శాతం సాల్వెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని నిబంధన పెట్టింది. అదే విధంగా మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ కూడా ఇవ్వాలి. గతంలో ఎలాంటి డిఫాల్ట్ చరిత్రలేని మిల్లర్లు ధాన్యం విలువకు 10శాతం బ్యాంక్ పూచీకత్తు లేదా 25శాతం సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక డిఫాల్ట్ మిల్లర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కేటాయించకూడదని నిబంధన పెట్టింది. ఇదిలా ఉంటే మిల్లర్లు, వారికి గ్యారెంటీగా ఉండే మిల్లర్లు వారి ఆస్తుల విలువలను కూడా వెల్లడించే నిబంధన పెట్టినట్టు తెలిసింది. వారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, వాళ్ల బ్యాక్‌గ్రౌండ్‌ను కూడా తెలియజేయాలని కండిషన్ పెట్టినట్టు తెలిసింది. ఒకవేళ మిల్లర్ డిఫాల్ట్ అయితే వారి ఆస్తులను జప్తు చేసేందుకు వీలుగా ఈ నిబంధన పెట్టినట్టు చర్చ జరుగుతున్నది. ప్రభుత్వమే తమకు బలవంతంగా ధాన్యం అంటగడుతున్నదనే వాదన నేపథ్యంలో ఇకపై మిల్లర్ల నుంచి అఫిడవిట్‌ను తీసుకోవాలని నిర్ణయించింది. తమ ఇష్టం మేరకు ధాన్యం దించుకుంటున్నట్టు ఈ అఫిడివిట్ ఇవ్వాలని షరతు పెట్టింది.
మిల్లర్ల వ్యతిరేకత.. కొనుగోళ్లపై ఎఫెక్ట్
ధాన్యం కేటాయింపులో తాజా నిబంధనలను మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి నిబంధనలతో తాము మిల్లులు నడుపలేమని, ధాన్యం దించుకోలేమని తెగేసి చెప్తున్నారు. ఇందులో కొన్ని నిబంధనలను సడలించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటిదాకా ధాన్యం దించుకోబోమని స్పష్టంచేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటివరకు జిల్లాల్లో మిల్లర్లతో సివిల్ సప్లయ్‌కి ఒప్పందాలు జరుగలేదు. ఇది ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తున్నది. ఓ వైపు కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొస్తున్న నేపథ్యంలో మిల్లర్లతో ఒప్పందం జరిగితే ధాన్యాన్ని కాంటా పెట్టే అవకాశం ఉంటుంది. లేకపోతే రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో రైతులకు ఇబ్బందలు కలుగకుండా చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

