లక్నో: సోషల్ మీడియాలో పరిచయమైన ఒక జంట ఆన్లైన్లో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి వేదిక వద్దకు చేరిన వరుడ్ని వధువు గుర్తించలేకపోయింది. ఫోన్లో తాను మాట్లాడే వ్యక్తి అతడు కాదని చెప్పి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వధువు బంధువులు వరుడ్ని కొట్టడంతో అతడు ఆసుపత్రిపాలయ్యాడు. (Groom Beaten Up) ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక జంటకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ తరచుగా ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమలో పడటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
కాగా, మే 12న మహిళ కుటుంబం పెళ్లి ఏర్పాట్లు చేసింది. ఆ వ్యక్తి, అతడి కుటుంబానికి హోటల్లో వసతి కల్పించింది. వరుడిగా ముస్తాబైన 23 ఏళ్ల దేవేంద్ర సింగ్ పరిమార్ తన కుటుంబంతో కలిసి పెళ్లి ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే లాయర్ అయిన ఆమె వరుడికి షాక్ ఇచ్చింది. తాను రోజూ ఫోన్లో మాట్లాడే వ్యక్తి అతడు కాదని ఆరోపించింది. రాహుల్ మిశ్రాగా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో తాను మాట్లాడటంతో పాటు అతడ్ని ప్రేమించి పెళ్లికి సిద్ధమైనట్లు తెలిపింది.
మరోవైపు ఈ పరిణామం నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో వధువు కుటుంబ సభ్యులు, ఆమె బంధువులు దేవేంద్ర సింగ్‌పై దాడి చేసి కొట్టారు. గాయపడిన వరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వధువు ఇంటికి చేరుకున్నారు. వరుడిపై దాడి చేసిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Hardoi, UP : Bride refuses to marry groom, saying he was not the man she was speaking to online; chaos breaks out at wedding.
Instead of Rahul Mishra, who Priya said she had been talking with and had agreed to marry, it was Devendra Singh Parmar who turned up in wedding finery.… pic.twitter.com/NmcutG1KPg
— News Arena India (@NewsArenaIndia) May 14, 2026