బీజింగ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆ టూర్‌ను రిపోర్టు చేసేందుకు అమెరికా జర్నలిస్టులు (US Journalists)వెళ్లారు. అయితే అమెరికా, చైనా జర్నలిస్టుల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. తన కాన్వాయ్‌తో వెళ్తున్న ట్రంప్ వెనుక వెళ్లేందుకు అమెరికా జర్నలిస్టులు ప్రయత్నించారు. ఆ సమయంలో చైనా అధికారులు వారిని అడ్డుకున్నారు. కాన్వాయ్ వెళ్లిన తర్వాత వెళ్లాలని ఆదేశించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న చైనా, అమెరికా జర్నలిస్టుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. తమ ప్రోటోకాల్ ప్రకారం ఈ ఆదేశాలను అమలు చేస్తున్నామని చైనీయులు చెప్పారు. మేం ప్రెసిడెంట్ కాన్వాయ్‌తో వెళ్లాలని ఓ అమెరికా రిపోర్టర్ అన్నారు. ఆ సమయంలో ఓ చైనీస్ రిపోర్టర్ మాట్లాడుతూ.. ఇది మా దేశం, ఇక్కడ ఈ ప్రదేశాన్ని విడిచి సెక్యూర్టీ వెళ్లనివ్వదని అన్నారు. జర్నలిస్టుల మధ్య కాసేపు తోపులాట జరిగింది. ఓ సపరేటు రూమ్‌లో అమెరికా జర్నలిస్టులను బంధించినట్లు తెలుస్తోంది. ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌ను ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ లేదా అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులు గురించి వైట్‌హౌజ్ కానీ, చైనా అధికారులు కానీ ప్రకటన చేయలేదు.
CHAOS erupted behind the scenes during President Trump’s meeting with Xi Jinping in China.
A heated confrontation broke out between U.S. and Chinese media personnel as reporters scrambled to join the presidential motorcade.
🗣️ REPORTER: “Do you understand that we are in the… pic.twitter.com/GhsYdvC8nl
— RB. (@KailashVashi) May 15, 2026