లక్నో: బలమైన ఈదురు గాలులకు ఒక వ్యక్తి గాల్లోకి ఎగిరాడు. సుమారు 50 అడుగుల ఎత్తు వరకు గాలిలోకి ఎగిరిన అతడు కిందపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి గాయపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Bareilly Man Thrown Into Air) ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. గాలివాన బీభత్సం కారణంగా సుమారు 60 మంది మరణించారు.
కాగా, బలమైన గాలులకు బమియానా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అమాంతం గాలిలోకి లేచాడు. టిన్ షెడ్‌తో సహా సుమారు 50 అడుగుల ఎత్తు వరకు గాలిలోకి ఎగిరాడు. ఆ తర్వాత అంత ఎత్తు నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వ్యక్తిని నన్హే మియాన్‌గా గుర్తించారు. కాళ్లు, చేతులు విరిగిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు ప్రభుత్వ సహాయం అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Just in India: In Bareilly’s Bhmora police station area, at Bamiana, a young man was lifted into the air along with a tin shed during a fierce storm and rain. The video of the man flying in the wind is going viral on social media. In the accident, the young man’s hands and legs… pic.twitter.com/E6Abz6FBUE
— X Secular (@x4secular) May 14, 2026
#WATCH | Bareilly, UP | Man seen in viral video being flung through the air during violent storms in UP yesterday, Nanhe Miyan, says, “I am a labourer… I was working when the storm struck… That’s when the structure began to lift into the air. There were four other people with… pic.twitter.com/ClE754y2nc
— ANI (@ANI) May 14, 2026