లక్నో: ఒక జంట ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. యువతి తల్లి ఫిర్యాదుతో యువకుడిపై కిడ్నాప్‌తోపాటు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన ఆ వ్యక్తిని కోర్టుకు తరలిస్తుండగా ఆ యువతి టవర్ ఎక్కింది. (woman climbs tower) తన భర్తను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 2025 అక్టోబర్‌లో యువతీ, యువకుడు కలిసి తమ ఇళ్ల నుంచి పారిపోయారు. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
కాగా, తన కుమార్తెను కిడ్నాప్ చేసినట్లు యువతి తల్లి ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో యువతి మైనర్ కావడంతో కిడ్నాప్‌తో పాటు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
మరోవైపు మే 12న జైలులో ఉన్న ఆ వ్యక్తిని కేసు విచారణ కోసం కోర్టుకు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఆ యువతి, పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న హై టెన్షన్ ట్రాన్స్మిషన్ టవర్ ఎక్కింది. తన భర్తను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేసింది.
ఇది తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ యువతికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో కోర్టు అనుమతితో ఆ వ్యక్తిని అక్కడకు తీసుకువచ్చారు. తన భర్తను చూసిన తర్వాత ఆ యువతి టవర్ నుంచి కిందకు దిగింది. ఆ తర్వాత వారిద్దరూ కౌగిలించుకుని భావోద్వేగంలో మునిగిపోయారు.
అనంతరం పోలీసులు ఆ వ్యక్తిని జైలుకు తరలించారు. టవర్ ఎక్కి నిరసన తెలిపిన ఆ యువతికి నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ ఇస్తామని పోలీస్ అధికారి తెలిపారు. బాలీవుడ్ పాత సినిమా షోలేను తలపించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Kanpur, UP: A woman climbs a tower demanding the release of a man from jail.
As per Vipin Tanda, Additional Police Commissioner, Law & Order, Kanpur, a case was registered by her mother at Sachendi Police Station, against a man for kidnapping her in October 2025. The… pic.twitter.com/VhrxqVgJrH
— ANI (@ANI) May 12, 2026