వరంగల్ : చెరువుల మరమ్మతు పేరుతో అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో 10 టన్నుల చేపలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే..వరంగల్ నగరంలోని చిన్న వడ్డేపల్లి చెరువుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈ క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల చెరువులో ఉన్న
సుమారు 10 టన్నుల చేపలు ఆక్సిజన్ అందక మృత్యువాత పడ్డాయి.
ఈ విషయంలో అసలేం జరిగిందో చెప్పేందుకు మత్స్యశాఖ స్పష్టత ఇవ్వటం లేదు. మరో వైపు నీటిని ఖాళీ చేసేందుకు కావాలనే ఎవరో విష ప్రయోగం చేయచ్చేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, చెరువు మీద ఆధారపడిన మత్స్యకారులు తమకు ఉపాధినిచ్చే 30 లక్షల చేపల ఊపిరి తీసిన వారికి తమ ఉసురు తాకుతుందని ఆవేదన చెందుతున్నారు.