హైదరాబాద్,సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మాణాలు చేపట్టరాదన్న ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించినప్పటికీ అకడ నిర్మాణాలు జరుగుతుంటే కళ్లప్పగించి చూస్తూ ఉన్నారా అని మండిపడింది. ఉత్తర్వులకు విరుద్ధంగా ఐఏఎస్, ఐపీఎస్లు, వాళ్ల కుటుంబసభ్యులు, బంధువులు, ఇతర ప్రైవేటు వ్యక్తులు చేపట్టిన నిర్మాణాలపై నివేదిక ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని నిలదీసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి నోటీసులు జారీచేసింది. కోర్టు ధికరణ పిటిషన్లో కౌంటర్లు దాఖలుచేయాలని ఆదేశించింది. పూర్తి వివరాలతో నివేదికను కూడా సమర్పించాలని చెప్పింది. తదుపరి విచారణను అక్టోబరు 10వ తేదీకి వాయిదా వేసింది. నాగారం గ్రామంలోని సర్వే నం. 181, 182, 194, 195ల్లోని భూదాన భూముల్లో భూదందా వెనుక ఉన్నతస్థాయి అధికారులు ఉన్నందున ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తునకు ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ మహేశ్వరం మండలానికి చెందిన బిర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిని గతంలో విచారించిన హైకోర్టు, తాము తిరిగి ఉత్తర్వులు జారీచేసే వరకు సదరు భూముల్లో లావాదేవీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, భూముల క్రయవిక్రయాలు చేయరాదని, నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. అయితే, ఆ స్థలాలకు ప్రహరీల నిర్మాణాలు చేయడం కోర్టు ధికరణ కిందకు వ స్తుంటూ మల్లేశ్ దాఖలు చేసిన మరో పిటిషన్ను జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం విచారించారు. పిటిషనర్ న్యాయవాది వాది స్తూ, గత జూన్లో ఈ భూములపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసినప్పటికీ నివేదిక ఇవ్వలేదని తెలిపారు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రహరీల నిర్మాణం చేపట్టిరని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకో ర్టు, గత ఉత్తర్వులకు వ్యతిరేకంగా చర్యలు ఉండటంపై అసంతృప్తిని వ్యక్తంచేసింది. కలెక్టర్కు నోటీసులు జారీచేసింది.