సూర్యాపేటటౌన్, సెప్టెంబర్ 22 : మాదక ద్రవ్యాల వినియోగంతో యువత భవిష్యత్తు అంధకారం అవుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త ప్రభాకర్ డ్రగ్స్ దుష్పరిణామాలు, నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన బైక్ ర్యాలీని ఎస్పీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి దుష్పరిణామాలు, నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు వాహనంపై ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయు డు ప్రభాకర్‌ను అభినందించారు. సెలవులను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ప్రభాకర్ ముం దుకు రావడం అభినందనీయమన్నారు.
ప్రస్తుత సమాజంలో గంజా యి, డ్రగ్స్ అనేవి అత్యంత ప్రమాదకరంగా మారాయని యువత వీటి బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. వీటివల్ల దేశంలోని యువశక్తి నిర్వీర్యం అవుతోందన్నారు. ప్రతి పౌరు డు గంజాయి నిర్మూలనను సామాజిక బాధ్యతగా చేపట్టాలని పిలుపునిచ్చారు.
గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం, సరఫరా తదితర విషయాలను డయల్ నంబర్100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రవీందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ వడ్డె ప్రసన్న, ఆర్ఐ నారాయణరాజు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీసు సంఘం అధ్యక్షుడు రామచందర్‌గౌడ్, ఆర్ఎస్సైలు అశోక్, సాయిరాం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.