ఊట్కూర్, సెప్టెంబర్ 22 : ఊరకుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్న పిల్లలు, మనుషులు, పశువులపై దాడులు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దపొర్లలో ఆదివారం సా యంత్రం చీకటి వేళలో కనిపించిన మనుషులు, పశువులపై ఊర కుక్క లు దాడి చేయడంతో 8 మం ది స్థానికులతో పాటు రెండు పశువులను తీవ్రంగా గాయపడిన ఘటన చోటు చేసుకున్నది.
కుక్కల దాడిలో గాయపడిన అజయ్ (6), శ్రావ్య (7), లక్ష్మి (17), కొండమ్మ (40), శశికళ (50)తోపాటు మరో ముగ్గురు వ్యక్తులను స్థానికులు మహబూబ్నగర్ జిల్లా దవాఖానకు తరలించారు. కాగా, ఒకే రోజు మనుషులు, పశువులపై ఊర కుక్కలు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరచడంతో స్థానికు లు హడలెత్తుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో ఊర కుక్కల బెడద నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.