ఖాకీలపై మంత్రి ఫైర్
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నేతలకు.. పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
- భీమారం పీహెచ్సీ ప్రారంభంలో పోలీసులు.. కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట
- ఏసీపీ, సీఐపై బన్సీలాల్‌పై మినిస్టర్ అసహనం
- మంత్రి రాకముందే వెళ్లిపోయిన ఐకేపీ మహిళలు
భీమారం, సెప్టెంబర్ 22 : మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నేతలకు.. పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. సోమవారం మంత్రి వివేక్‌తో పాటు కలెక్టర్ కుమార్ దీపక్ పీహెచ్సీ ప్రారంభించిన అనంతరం హాస్పిటల్ లోపల కలియదిరుగుతున్నారు. అదే సమయంలో భీమారం కాంగ్రెస్ కార్యకర్తలు, మాజీ సర్పంచ్‌లను పోలీసులు లోపలికి రాకుండా అడ్డుకున్నారు.
జైపూర్ మండల అధ్యక్షుడు మహ్మద్ ఫాయజొద్దీన్, నాయకుడు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి రాగా, వారిని సైతం అడ్డుకోవడంతో ఘర్షణ వాతవరణం నెలకొంది. కార్యకర్తలను అడ్డుకోవడానికి మీరెవరని ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇందుకు స్పందించిన మంత్రి వివేక్ పోలీసులపై సీరియస్ అయ్యారు. ఏసీపీ వెంకటేశ్వర్లతో పాటు కోటపల్లి సీఐ బన్సీలాల్‌పై అసహనం వ్యక్తం చేశారు.
ఐకేపీ మహిళలను బతుకమ్మ చీరల పేరిట భీమారం తరలించగా, వేచి చూసి మంత్రి రాకముందే అక్కడి నుంచి వెళ్లిపోయారు. చీరలు ఇస్తామని ఐకేపీ సీసీలు, సీఏలు ఆధార్ కార్డులతో రామ్మన్నారని.. ఇక్కడ చూస్తే ఏమీ లేదంటూ మహిళలు అసహనంతో వెళ్లిపోయారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి మోహన్ రెడ్డి, నేతలు సత్యనాయరాయణ రెడ్డి, రవి, శ్రీనివాస్, శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ రాజ్‌కుమార్ నాయక్, మాజీ సర్పంచ్ రమేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

